Mahindra and Mahindra: మహీంద్రా వాహనాలకు తగ్గని గిరాకీ.. అక్టోబర్ లో టాప్ గేర్ లో దూసుకెళ్లిన సేల్స్.. మిగతా కార్ బ్రాండ్ల పరిస్థితి ఏంటీ?

Mahindra and Mahindra October Sales: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాల్లో టాప్ గేర్ లో దూసుకుపోతోంది. అక్టోబర్ నెలలో భారీగా విక్రయాలు జరిగాయని ఎం అండ్ ఎండ్ ప్రెసిడెంట్ విజయ్ తెలిపారు. అక్టోబర్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 54, 504 వాహనాలు ఎస్వీయూ అమ్మకాలు  25 శాతం వృద్ధి, 20 శాతం వృద్ధితో 96,648 వాహనాలతో అత్యధిక మొత్తం అమ్మకాలు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. మరి మిగతా వాహనాల పరిస్థితి ఏంటో చూద్దాం.   

Written by - Bhoomi | Last Updated : Nov 2, 2024, 09:54 AM IST
Mahindra and Mahindra: మహీంద్రా వాహనాలకు తగ్గని గిరాకీ.. అక్టోబర్ లో టాప్ గేర్ లో దూసుకెళ్లిన సేల్స్.. మిగతా కార్ బ్రాండ్ల పరిస్థితి ఏంటీ?

Mahindra and Mahindra October Sales: మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా  వాహనాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. దీని ప్రభావం కంపెనీ విక్రయాలపై పడింది. వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా అక్టోబర్‌లో అత్యుత్తమ నెలవారీ విక్రయాలను నమోదు చేసినట్లు ఆ కంపెనీ ప్రెసిడెంట్ తెలిపారు. కంపెనీ 96,648 యూనిట్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో 80,679 యూనిట్లతో పోలిస్తే 20 శాతం ఎక్కువని పేర్కొన్నారు. యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్లో, దేశీయ విపణిలో 54,504 యూనిట్లను విక్రయించింది. ఇది ఏడాది క్రితం ఇదే కాలంలో 43,708 యూనిట్ల నుండి 25 శాతం పెరిగిందని మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) ఒక ప్రకటనలో తెలిపింది. ఎగుమతులతో సహా ప్యాసింజర్ వాహనాల మొత్తం హోల్‌సేల్ అమ్మకాలు 55,571 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. గత నెలలో దేశీయంగా వాణిజ్య వాహనాల విక్రయాలు 28,812 యూనిట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో టాటా వాహనాల విక్రయాల్లో స్వల్ప తగ్గుదల కనిపించిందని వెల్లడించారు. 

SUV అమ్మకాలు 25శాతం పెరుగుదల: 

అక్టోబర్ నెలలో ఇప్పటివరకు అత్యధికంగా 54,504 వెహికల్స్ ఎస్వీయూ అమ్మకాలు, 25 శాతం వృద్ధి, 20 శాతం వృద్ధితో 96,648 వాహనాలతో అత్యధిక మొత్తం అమ్మకాలు సాధించడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నామని తెలిపారు. అక్టోబర్ నెల లాభాలతో ప్రారంభమైంది. థార్ రాక్స్‌కు మొదటి 60 నిమిషాల్లో 1.7 లక్షల బుకింగ్స్ వచ్చినట్లు తెలిపారు. పండుగల దృష్ట్యా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో సానుకూల జోరు కొనసాగింది. ఎం అండ్ ఎం  వ్యవసాయ పరికరాల విభాగం (FES) గత నెలలో అత్యధికంగా 64,326 ట్రాక్టర్ల దేశీయ విక్రయాలను నమోదు చేసింది. అక్టోబర్ 2023లో 49,336 యూనిట్లు ఉన్నాయి. ఎగుమతులతో సహా మొత్తం ట్రాక్టర్ విక్రయాలు గత నెలలో 65,453 యూనిట్లుగా ఉన్నాయి. 2023 ఇదే కాలంలో 50,460 యూనిట్లు ఉన్నాయి. ట్రాక్టర్ పరిశ్రమ అనేక సానుకూల అంశాలు కలిసి రావడంతో చాలా బలమైన వృద్ధిని సాధించింది ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా అన్నారు. 

Also Read: Pension:ఈ స్కీములో చేరినట్లయితే..మీకు రిటైర్మెంట్ తర్వాత రెండు లక్షల పెన్షన్ లభించడం పక్కా  

తగ్గిన టాటా మోటార్స్ విక్రయాలు: 

టాటా మోటార్స్ లిమిటెడ్ దేశీయ, అంతర్జాతీయ విక్రయాలు అక్టోబర్‌లో 82,682 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది ఇదే నెలలో 82,954 యూనిట్లు ఉన్నాయి. గత నెలలో మొత్తం దేశీయ విక్రయాలు 80,825 యూనిట్ల నుంచి 80,839 యూనిట్లకు స్వల్పంగా పెరిగాయని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో టాటా మోటార్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలతో సహా మొత్తం ప్యాసింజర్ వాహనాల (PV) అమ్మకాలు అక్టోబర్ 2023లో 48,637 యూనిట్ల నుండి 48,423 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. అదే విధంగా దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు కూడా 48,131 యూనిట్లకు తగ్గాయని, అంతకు ముందు ఏడాది ఇదే నెలలో 48,337 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్ గత నెలలో దాని మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలు 34,259 యూనిట్లుగా ఉన్నాయని, అక్టోబర్ 2023లో 34,317 యూనిట్లుగా నమోదయ్యాయని వెల్లడించింది. 

Also Read: Gold Rate Today:భారీగా తగ్గిన బంగారం ధర.. తులం పసిడి ధర ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News