Mahindra Xuv 3Xo: టెస్లా కార్లను మించిన డిజైన్‌తో Mahindra Xuv 3Xo రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Mahindra Xuv 3Xo: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా త్వరలోనే తమ XUV 3XO కారును లాంచ్‌ చేయబోతోంది. అయితే ఈ కారు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది. అయితే XUV 3XO కారును సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 17, 2024, 05:30 PM IST
Mahindra Xuv 3Xo: టెస్లా కార్లను మించిన డిజైన్‌తో Mahindra Xuv 3Xo రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Mahindra Xuv 3Xo Launch Date: ప్రముఖ భారత ఆటోమొబైల్‌ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త కారును లాంచ్‌ చేయబోతోంది. ఇటీవలే లాంచ్‌ చేసిన 9-సీటర్ మహీంద్రా బొలెరో నియో ప్లస్‌కి మార్కట్‌లో మంచి గుర్తింపు లభించడంతో కంపెనీ మరో ముందడు వేసింది. తమ కొత్త  మహీంద్రా XUV 3XOని ఏప్రిల్ 29న లాంచ్‌ చేయబోతున్నట్లు ప్రక్రటించింది. అయితే మహీంద్రా కంపెనీ త్వరలోనే లాంచ్‌ కాబోయే ఈ కారును ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అలాగే అద్భుతమై డిజైన్‌ కలిగి ఉండబోతున్నట్లు ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

మహీంద్రా XUV 3XO ఇంటీరియర్ వివరాలు:
మహీంద్రా కంపెనీ త్వరలోనే లాంచ్‌ చేసే XUV 3XO ఎస్‌యూవీ ప్రీమియం ఇంటీరియర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఆకర్శనీయమైన డిజైన్‌ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ప్రీమియం ఐసిన్-సోర్స్డ్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది అతి శక్తివంతమైన అధునాతన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు లోపల సీట్స్‌పై కవర్‌ లెదర్‌ను కలిగి ఉండబోతోంది. 

సరికొత్త ఫీచర్స్‌:
మహీంద్రా XUV 3XO కారు లార్జ్‌ పనోరమిక్ సన్‌రూఫ్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రీమియం వేరియంట్స్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌లో కూడా అనేక ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు లెవెల్ 2 ADAS టెక్నాలజీని కూడా అందుబాటులోకి ఉంచబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే ఈ కారులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను అందించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మంచి డ్రైవింగ్‌ అనుభవం కోసం 360 డిగ్రీల  పార్కింగ్‌ కెమెరాను అందుబాటులో ఉంచబోతోంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

మహీంద్రా XUV 3XO ఇంజన్, పవర్‌ట్రెయిన్:
ఈ కారు ప్రీమియం పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులోకి రాబోతోంది.  ఈ కారు మొత్తం మూడు ఇంజన్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో 1.5L డీజిల్, 1.2L డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బోతో పాటు 1.2L టర్బో పెట్రోల్ ఇంజన్‌ ఆప్షన్స్‌లో కంపెనీ విడుదల చేయబోతోంది. అలాగే 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రాబోతోంది. దీంతో పాటు AMT గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News