New Tata Punch Facelift: ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న టాటా కార్లలో పంచ్ ఒకటి. ఈ కారుకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే దీనిని గుర్తించిన టాటా కంపెనీ, త్వరలోనే ఈ కారును SUV మోడల్‌లో లాంచ్ చేయబోతోంది. ఎలక్ట్రిక్ మోడల్‌లో టాటా పంచ్ మంచి గుర్తింపు పొందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ అతి త్వరలోనే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ కారు మోడల్‌ను కూడా రూపొందించినట్లు సమాచారం. అయితే మొదటిసారిగా సారిగా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పరీక్షించిన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. టాటా కంపెనీ ఈ కారును ఈ సంవత్సరం చివరి నెలల్లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పంచ్ ఫేస్‌లిఫ్ట్ పరీక్ష సమయంలో రోడ్లపై దర్శనమిచ్చింది. అయితే ఈ సమయంలో కొంతమంది తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అంతకముందే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ కొన్ని లీక్ అయ్యాయి. ఈ కారు ఫ్రాంట్ ప్రొఫైల్‌లో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఫ్రాంట్‌లో భాగంలో హెడ్‌ల్యాంప్‌లు, LED DRLలు నిలువుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అప్‌డేట్ బంఫర్‌ను కూడా అందిచబోతోంది. ఈ కారు కొత్త అల్లాయ్ వీల్స్‌తో సైడ్ ప్రొఫైల్ ఉండబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా టెయిల్ విభాగంలో అనేక మార్పులు కనబడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది.
ఇక ఈ కారుకు సంబంధించిన ఇంటీరియర్ విషయానికొస్తే..ఈ పంచ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఎంతో ప్రీమియం లుక్‌లో కనిపించే టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్స్‌ను ఛార్జ్ చేసుకోవడానికి వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 360 డిగ్రీల పార్కింగ్ ఫీచర్‌ను కూడా అప్‌డేటెడ్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కారు అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో రాబోతోంది. అలాగే భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.
ఇక పవర్‌ట్రెయిన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ పంచ్ ఫేస్‌లిఫ్ట్ 1.2 లీటర్ శక్తివంతమైన యాస్పిరేటెడ్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఇంజన్ 113 Nm గరిష్ట టార్క్‌తో పాటు 85 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుందని లీక్ అయిన వివరాల ప్రకారం తెలుస్తోంది. దీంతో పాటు ఇది సాధారణ మోడల్‌తో పోలిస్తే దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ధర పెరిగే అవకాశాల ఉన్నాయి. ఇది మార్కెట్‌లోకి లాంచ్ అయితే..దాదాపు నవంబర్ నెలలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ టాప్ ఫీచర్స్:
ఇంటీరియర్ మార్పులు:
7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & యాపిల్ కార్‌ప్లే
కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
కొత్త సీట్ ఫాబ్రిక్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్
ఫీచర్లు:
క్రూజ్ కంట్రోల్
ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
పుష్-బటన్ స్టార్ట్/స్టాప్
రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, కెమెరా
భద్రత:
6 ఎయిర్‌బ్యాగులు
EBDతో ABS
ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లు
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
ట్రాక్షన్ కంట్రోల్
ఇంజన్, ట్రాన్స్‌మిషన్:
1.2L NA పెట్రోల్ ఇంజన్
5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్
86 PS శక్తి, 113 Nm టార్క్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి