ZEEL: సెబీ ఆర్డర్‌పై జీ అధికారిక ప్రకటన.. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కృషి

ZEE Entertainment Enterprises Ltd: సెబీ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై ZEEL ఛైర్మన్ ఆర్.గోపాలన్ స్పందించారు. సెబీ ఆర్డర్లను బోర్డు సమీక్షిస్తోందని చెప్పారు. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కృషి చేస్తామని తెలిపారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2023, 11:53 AM IST
ZEEL: సెబీ ఆర్డర్‌పై జీ అధికారిక ప్రకటన.. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కృషి

ZEE Entertainment Enterprises Ltd: ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ డా.సుభాష్ చంద్ర, గ్రూప్ కంపెనీ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పునీత్ గోయెంకాలకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన ఉత్తర్వులపై జీ ఛైర్మన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సెబీ మధ్యంతర ఉత్తర్వులను జీ ఎంటర్‌టైన్‌మెంట్ బోర్డు పరిగణనలోకి తీసుకుందని కంపెనీ ఛైర్మన్ ఆర్.గోపాలన్ తెలిపారు. ప్రస్తుతం బోర్డు సెబీ ఆర్డర్‌ను పూర్తిగా సమీక్షిస్తోందని చెప్పారు. ఈ విషయంలో న్యాయ సలహా కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

"డా.సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకాలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) జారీ చేసిన మధ్యంతర ఎక్స్-పార్టీ ఆర్డర్‌ను Zee ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) డైరెక్టర్ల బోర్డు గుర్తించింది. బోర్డు ప్రస్తుతం వివరణాత్మక ఆర్డర్‌ను సమీక్షించే ప్రక్రియలో ఉంది. అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవడానికి తగిన న్యాయ సలహాను కోరుతోంది. పెట్టుబడిదారుల ప్రయోజనాల దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటాం.. 

డా.సుభాష్ చంద్ర గణనీయమైన సహకారాన్ని బోర్డు అభినందిస్తుంది. దీనితో పాటు పునీత్ గోయెంకా నాయకత్వంలో కంపెనీ మంచి పనితీరును కనబరిచింది. వ్యాపారంలో మంచి వృద్ధిని సాధించింది. కంపెనీకి సంబంధించిన విలువైన షేర్‌ హోల్డర్‌లందరి ముందంజలో ఉండేలా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. కంపెనీ  భవిష్యత్ కోసం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం కొనసాగిస్తుంది. వాటాదారులందరికీ విలువ పెంచడంపై బోర్డు నమ్మకంగా ఉంది.." అని ఆర్‌.గోపాలన్ తెలిపారు.
 
డా.సుభాష్ చంద్ర, ZEEL మేనేజింగ్ డైరెక్టర్ గోయెంకా ఇకపై ఏ లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్ లేదా ముఖ్యమైన పదవులను నిర్వహించకూడదని సెబీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెబీ ఆర్డర్ తర్వాత జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు కూడా క్షీణించాయి. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో ZEEL షేర్ 192.15 వద్ద ట్రేడవుతోంది. ఇందులో 1.39 శాతం స్వల్ప క్షీణత ఉంది. 

Trending News