OlaCabs Prime Plus In Hyderabad: హైదరాబాద్‌లో నేటి నుంచి ఓలా క్యాబ్స్ ప్రైమ్ ప్లస్ సేవలు

OlaCabs Prime Plus Service In Mumbai, Pune, Hyderabad: హైదరాబాద్ : ఓలా క్యాబ్స్ శుక్రవారం తమ కస్టమర్స్ కి కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ అందిస్తోన్న ప్రైమ్ ప్లస్ సేవలను నేటి నుంచి హైదరాబాద్, ముంబై, పూణే నగరాలకు విస్తరిస్తున్నట్లు ఓలా క్యాబ్స్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

Written by - Pavan | Last Updated : Aug 5, 2023, 10:55 AM IST
OlaCabs Prime Plus In Hyderabad: హైదరాబాద్‌లో నేటి నుంచి ఓలా క్యాబ్స్ ప్రైమ్ ప్లస్ సేవలు

OlaCabs Prime Plus Service In Mumbai, Pune, Hyderabad: హైదరాబాద్ : ఓలా క్యాబ్స్ శుక్రవారం తమ కస్టమర్స్ కి కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ అందిస్తోన్న ప్రైమ్ ప్లస్ సేవలను నేటి నుంచి హైదరాబాద్, ముంబై, పూణే నగరాలకు విస్తరిస్తున్నట్లు ఓలా క్యాబ్స్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టివ ఓలా ప్రైమ్ ప్లస్ సేవలను నేటి నుంచి హైదరాబాద్, ముంబై, పూణే నగరాలకు విస్తరిస్తున్నాం అని భవీష్ అగర్వాల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

బెంగళూరులో ప్రైమ్ ప్లస్ ట్రయల్ సర్వీసెస్ విజయవంతమైందన్న భవిష్ అగర్వాల్.. ఈరోజు నుంచే హైదరాబాద్, ముంబై, పూణే నగరాల్లో ఎంపిక చేసిన కొంతమంది కస్టమర్స్‌కి ప్రైమ్ ప్లస్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుందని.. త్వరలోనే ఈ సేవలు అందరికి వర్తించేలా చేస్తాం" అని భవిష్ అగర్వాల్ చెప్పారు.

ఓలా ప్రైమ్ ప్లస్ సర్వీస్ అంటే ఏమిటి
ఓలా క్యాబ్స్ ప్రైమ్ ప్లస్ సర్వీస్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన కస్టమర్లకు విస్తృత శ్రేణిలో ప్రీమియం ఫీచర్లు, బెనిఫిట్స్ అందించడం జరుగుతుందని.. అది కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది అని భవిష్ అగర్వాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. బెంగళూరులో విజయం సాధించిన నేపథ్యంలో ముంబై, హైదరాబాద్, పూణె నగరాలకు ఓలా క్యాబ్స్ ప్రైమ్ ప్లస్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు స్పష్టంచేశారు. 

ఇది కూడా చదవండి : How To Earn More Money: చిన్న వయస్సులోనే ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసా ?

ఇండియాలో పుట్టి విదేశాలకు విస్తరించిన ఓలా క్యాబ్స్ 
బెంగుళూరులో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రారంభమైన ఓలా క్యాబ్స్ బిజినెస్.. ఇంతింతై వటుండింతై అన్న చందంగా పెరిగి పెద్దగై ఏకంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ వంటి దేశాలకు సైతం పాకింది.  బడాబడా కంపెనీలకు అధినేతలు సైతం ఇప్పుడు ఓలాలో పెట్టుబడిదారులుగా ఉన్నారంటే ఓలా ఎంత సక్సెస్ అయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కస్టమర్స్ అవసరాలకు అనుగుణంగా వారు ఎంచుకున్న సేవలు అందిస్తూ అటు వినియోగదారులకు సేవ చేస్తూనే భారీ మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్న సక్సెస్‌ఫుల్ బిజినెస్ మోడల్ ఇది. ఓలా క్యాబ్స్ బిజినెస్ సక్సెస్ అవడంతో ఆ తరువాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీలోకి ప్రవేశించి అందులోనూ అమ్మకాల్లో ముందంజలో నిలిచింది. 

ఇది కూడా చదవండి : Tata Punch iCNG: టాటా పంచ్ iCNG కారు వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News