Cyber Crimes Alert: ఈ మిస్టెక్స్ చేయకండి.. లేదంటే మీ బ్యాంక్ ఎకౌంట్ ఖాళీ

Cyber Crimes Alert: ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే క్రమంలోనో లేక ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ఉపయోగించే క్రమంలోనో చాలామంది యూజర్స్ తమకు తెలియకుండానే చేసే చిన్న పొరపాట్లు భారీ మూల్యం చెల్లించుకునేందుకు కారణం అవుతుంటాయి. ఒక్కోసారి లక్షలు, కోట్ల రూపాయలు కూడా కోల్పోతుంటారు. మరి అలా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Written by - Pavan | Last Updated : Aug 2, 2023, 11:45 AM IST
Cyber Crimes Alert: ఈ మిస్టెక్స్ చేయకండి.. లేదంటే మీ బ్యాంక్ ఎకౌంట్ ఖాళీ

Cyber Crimes Alert: ఆన్‌లైన్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ బారిన పడి నిత్యం కొన్ని వందలు, వేల మంది కొన్ని కోట్ల మొత్తంలో నష్టపోతున్నారు. కొంతమంది చిన్న మొత్తంలోనే దోచుకుంటూ అలా కొన్ని వేలు, లక్షల మందిని టార్గెట్ చేస్తోంటే... ఇంకొంతమంది ఒకరిద్దరు బాధితుల నుంచి లక్షలు, కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ప్రతీ రోజూ మనం వార్తల్లో చూస్తోన్న సైబర్ బాధితుల దీనగాథలే అందుకు నిదర్శనం. ఇంకా చెప్పాలంటే పోలీసుల వరకు రాని నేరాలు కూడా ఇంకెన్నో ఉంటాయి. పోలీసుల వద్దకు వెళ్తే పరువు పోతుంది అని కొంతమంది.. పోలీసుల వద్ధకు వెళ్లినా సైబర్ నేరాల్లో పోయిన డబ్బు తిరిగి రావడం కష్టమే అనే భావనతో ఇంకొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే ఉండిపోతున్నారు. సైబర్ క్రిమినల్స్ చేతుల్లో మోసపోవడానికి అసలు కారణం తమకు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పిదాలే. ఆ తప్పిదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పొరపాటున కూడా థర్డ్ పార్టీ వెబ్‌సైట్లపైన ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయకండి. నేరుగా మీ బ్యాంకుకి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ పేజీలోకి వెళ్లిన తరువాతే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వండి. లేదంటే మీ బ్యాంక్ మొబైల్ యాప్ ఉపయోగించండి. లేదంటే ఫ్రాడ్‌స్టర్స్ గాలానికి మీరు చిక్కుకున్నట్టే. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ వెబ్‌సైట్లపై ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు... మీరు ఏదైనా పోటీ పరీక్షలకు లేదా జాబ్ అప్లికేషన్‌కి ఫీజు చెల్లిస్తున్నారు అనుకోండి... అప్పుడు అక్కడి నుంచే లింకుపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు సరైన వెబ్‌సైట్‌లోనే ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకున్న తరువాతే పేమెంట్‌కి ప్రొసీడ్ అవ్వడం ఉత్తమం.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం మీరు లాగిన్ అయ్యే ముందు మీరు బ్యాంక్ వెబ్‌సైట్ URL ని ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి. వెబ్‌సైట్ యూఆర్ఎల్‌లో ఉన్న స్పెల్లింగ్ కూడా చెక్ చేయండి. లేదంటే ఒకట్రెండు అక్షరాలు మినహా అచ్చం అదే పేరుతో ఉన్న బోగస్ వెబ్‌సైట్స్ ఎన్నో ఉంటాయి. మీకు తెలియకుండానే అలాంటి బోగస్ వెబ్‌సైట్స్‌లోకి లాగిన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అదే కానీ జరిగితే... మీరు మీ వివరాల్ని సైబర్ క్రిమినల్స్ చేతుల్లో పెట్టినట్టే అవుతుంది.

బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ లేదా మీ డెబిట్ కార్డు పిన్ షేర్ చేసుకోవాల్సిందిగా ఎవరైనా అడిగితే వారికి స్పందించవద్దు. బ్యాంకులు కానీ లేదా పోలీసులు కానీ ఎవ్వరికీ కూడా మీ పాస్‌వర్డ్, పిన్ అడిగే హక్కు లేదనే విషయం మర్చిపోకండి.

ఎట్టిపరిస్థితుల్లోనూ సైబర్ కేఫ్స్ లేదా లైబ్రరీలు వంటి పబ్లిక్ ప్లేసెస్‌లో మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయకండి. ఎందుకంటే అక్కడ మీకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు మీ చుట్టూ వల వేసి ఉంటారు. అక్కడ మీరు వాళ్ల చేతికి చిక్కి మోస పోయే ప్రమాదం ఉంది. అందుకే మీ పర్సనల్ కంప్యూటర్ లేదా మొబైల్లో మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేయండి. 

మీ పర్సనల్ సిస్టంలోనూ అప్‌డేటెడ్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవడం మర్చిపోవద్దు. లేదంటే సైబర్ నేరగాళ్లు పంపించే మాల్వేర్స్ ఈజీగా మీ సిస్టంపై ఎటాక్ చేసి మీ డేటాను చోరీ చేసి సైబర్ క్రిమినల్స్ చేతుల్లో పెడతాయి. 
ఇది కూడా చదవండి :  Cyber Criminal Real Story: వీడు మామూలోడు కాదు.. రోజుకు రూ 5 కోట్ల నుంచి 10 కోట్లు కాజేశాడు

సైబర్ క్రిమినల్స్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఇవ్వకుండా మీరు అప్రమత్తంగా ఉంటే.. ఎవరిని మోసం చేయాలో అర్థం కాక సైబర్ క్రిమినల్స్‌ సైతం జుట్టు పీక్కునేలా చేయొచ్చు. అఫ్‌కోర్స్.. సైబర్ క్రిమినల్స్ నేరాలకు పాల్పడటంలో అనేక పద్ధతులు ఉపయోగిస్తారు. కానీ అన్నివేళలా అప్రమత్తంగా ఉండి ఫ్రీ గిఫ్టుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఈమెయిల్స్.. ఇలా దేనికి ఆశపడకుండా ఉంటే సైబర్ క్రిమినల్స్ గాలానికి మనం చిక్కనట్టే కదా మరి.

ఇది కూడా చదవండి : Buy 1, Get 1 free Offer Scams: ప్లేట్ మీల్స్ భోజనం ఖరీదు రూ. 90 వేలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News