RBI About Rs 2000 Notes: రూ. 2 వేల నోట్లను తాత్కాలిక చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ.. ఆయా నోట్లను బ్యాంకుల వద్ద మార్చుకోవడానికి జనానికి ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన అంశంపై స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇప్పటికే 93 శాతం 2 వేల రూపాయల నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని స్పష్టంచేసింది. ప్రస్తుతం 24 వేల కోట్ల రూపాయల విలువైన 2 వేల రూపాయల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయి అని ఆర్బీఐ వెల్లడించింది. ఆగస్టు 31వ తేదీ నాటికి నమోదైన లావాదేవీల ప్రకారం ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టు ఆర్బీఐ తమ తాజా ప్రకటనలో పేర్కొంది.
బ్యాంకుల వద్దకు తిరిగి వచ్చిన 2 వేల రూపాయల నోట్ల మొత్తం విలువ 3.32 లక్షల కోట్లు ఉంటుంది అని ఆర్బీఐ తేల్చిచెప్పింది. అలా బ్యాంకుల వద్దకు వచ్చిన రూ 2000 నోట్లలో 87 శాతం కరెన్సీ నోట్లు డిపాజిట్స్ రూపంలో రాగా.. మిగతావి బ్యాంకుల వద్ద నోట్ల మార్పిడి జరిగింది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. రూ. 2 వేల నోట్లను చలామణి నుండి విత్‌డ్రా చేసుకుంటున్నట్టుగా మే 19వ తేదీన ఆర్బీఐ ప్రకటించింది. అదే సమయంలో నోట్ల డిపాజిట్ లేదా నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు తుది గడువు ఉంటుంది అని స్పష్టంచేసింది. ఆర్బీఐ ఇచ్చిన గడువు ప్రకారం రూ. 2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మరో నెల రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది.
ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఎవరైనా ఒక వ్యక్తి ఒక్క రోజుకు బ్యాంకు నుండి రూ. 20,000 వరకు.. అంటే 10 నోట్లు వరకు మార్చుకునేందుకు అవకాశం ఉంది. డిపాజిట్స్ పై పరిమితి లేనప్పటికీ.. లెక్కకు మించి రూ వేల నోట్లు డిపాజిట్ చేసే వారు తమ PAN కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అనే విషయం తెలిసిందే.
రూ. 2000 నోటును చలామణి నుండి ఉపసంహరించుకోవడానికి కారణం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లు కొత్త రూ. 2000 నోట్లను ముద్రించడం 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచే నిలిపేశారు. RBI చట్టం, 1934లోని సెక్షన్ 24(1) ప్రకారం రూ. 500 నోట్లను, 1000 నోట్లను చట్టబద్ధంగా రద్దు చేయడంతో కరెన్సీ నోట్ల వెలితి ఏర్పడింది. ఆర్థిక వ్యవస్థలో సజావుగా సాగేందుకు వీలుగా దేశ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో కేంద్రం రూ.2000 నోటును ప్రవేశపెట్టింది.
ఇది కూడా చదవండి : LPG Gas Cylinder Prices: మరో గుడ్‌న్యూస్.. గ్యాస్ ధరలు భారీగా తగ్గింపు
ఐతే, ఆ తరువాతి కాలంలో రూ. 2 వేల నోట్ల రాకతో కేంద్రం అనుకున్న లక్ష్యం నెరవేరడంతో పాటు ఇతర డినామినేషన్లలోనూ జనాల అవసరాలకు సరిపడే స్థాయిలో నోట్లు అందుబాటులోకి రావడంతో, 2018-19లో కేంద్రం 2000 రూపాయల నోట్లను ప్రింట్ చేయడం ఆపేసింది. తాజాగా చలామణిలో ఉన్న రూ. 2 వేల రూపాయల నోట్లను కూడా తిరిగి తీసుకునేందుకు ఆర్బీఐ నిర్ణయించుకుంది. ఒక రకంగా సెప్టెంబర్ 30 వరకు రూ. 2 వేల నోట్లు చలామణిలో ఉండేందుకు అవకాశం ఉన్నప్పటికీ... ఆ తరువాత ఇవి శాశ్వతంగా రద్దు చేయడం అనే అనుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Huge Fines For Cancelling Rides: ఓలా, ఉబర్ కస్టమర్స్‌కి మంచి రోజులొస్తున్నాయా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి