Rakesh Jhunjhunwala Tips: షేర్ మార్కెట్‌లో రాణించేందుకు ఝున్‌ఝున్‌వాలా చెప్పిన సూచనలివే

Rakesh Jhunjhunwala Tips: షేర్ మార్కెట్ దిగ్గజం రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పేరు తెలియనివారుండరు. స్టాక్ సెలెక్షన్‌లో కూడా ఝున్‌ఝన్‌వాలాకు మంచి పేరుంది. ఆయన సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2022, 06:56 PM IST
Rakesh Jhunjhunwala Tips: షేర్ మార్కెట్‌లో రాణించేందుకు ఝున్‌ఝున్‌వాలా చెప్పిన సూచనలివే

షేర్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించేందుకు అధ్యయనం, సంయమనం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. షేర్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించేందుకు ప్రముఖ షేర్ దిగ్గజం రాకేశ్ ఝున్‌ఝన్‌వాలా కొన్ని సూచనలు ఇస్తున్నారు.

షేర్ మార్కెట్‌లో స్టాక్ సెలెక్షన్ అనేది రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా చేసినట్టుగా ఎవరూ చేయలేరని పేరుంది. తరచూ తన స్నేహితులు, ఉద్యోగులతో షేర్ మార్కెట్‌లో పెట్టుబడులపై సూచనలు ఇస్తుండేవారు. షేర్ మార్కెట్ మంచి రిటర్న్స్ సాంధించాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలనే విషయంపై ఆయన ఇచ్చిన కొన్ని టిప్స్ పరిశీలిద్దాం.

షేర్ మార్కెట్ టైకూన్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇప్పుడు లేకపోయినా..ఆయన ఇచ్చిన విలువైన సూచనలు, సలహాలు ఇంకా అందరికీ గుర్తున్నాయి. స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ , ఇండియన్ వారెన్ బఫెట్‌గా పిల్చుకునే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇండియన్ షేర్ మార్కెట్‌లో ఎప్పుడూ బుల్లిష్‌గా ఉండేవారు. తక్కువ పెట్టుబడితో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ప్రారంభించిన షేర్ మార్కెట్ ప్రస్థానం ఇప్పుడు ఎవరూ అందుకోనంత ఎత్తుకు వెళ్లింది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడికి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కొన్ని ఫార్ములాలు కూడా ఇచ్చారు. ఇవి పాటిస్తే ఇన్వెస్టర్లకు కచ్తితంగా లాభాలు కలుగుతాయి.

రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా చేసిన సూచనలు

1. ఇతరులు షేర్లు అమ్ముతున్నప్పుడు మనం కొనుగోలు చేయాలి, ఇతరులు కొంటున్నప్పుడు మనం అమ్మాలి.
2. తొందరపాటులో ఎప్పుడూ నిర్ణయం తీసుకూకూడదు. ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు తగినంత టైమ్ తీసుకోవాలి
3. మానవ స్వభావానికి వ్యతిరేకంగా వ్యాపారులు వ్యవహరించాలి
4. కఠినమైన నిబంధనలు, నియమాలు ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలి.
5. నష్టాన్ని భరించే సామర్ధ్యం లేనంతవరకూ షేర్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించలేరు.
6. మార్కెట్‌ను గౌరవించడం, ఓపెన్ మైండ్ ఉండటం మంచిది. దేనిపై పెట్టుబడి పెట్టాలో ఆలోచించాలి.
7. వార్తల్లో ఉండే కంపెనీల్లో పెట్టుబడి ఎప్పుడూ మంచిది కాదు. 
8. అవసరమైతే టెక్నాలజీ, మార్కెటింగ్, బ్రాండ్, వ్యాల్యూ ప్రొటెక్షన్, ఫండ్స్ వంటి మార్గాల్లో పెట్టవచ్చు. వీటిని గుర్తించే సామర్ధ్యం ఉండాలి.

Also read: Investment Tips: స్వల్పకాలంలో డబ్బులు సంపాదించే 4 ప్రధాన మార్గాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News