Gold Rate Hike: పసిడిప్రియులకు షాకింగ్‌ న్యూస్.. ఆల్‌ టైం హైలో తులం బంగారం.. ఎంతో తెలుసా?

Shocking Gold Rate Hike: రికార్డు స్థాయిల్లో గోల్డ్‌ రేట్‌ పెరుగుతూ పసిడి ప్రియులకు బంగారం షాకిస్తుంది. సోమవారం ఏకంగా తులం బంగారం ఎంతకు చేరిందో తెలుసా? ఇది ఇప్పటి వరకు మీరు కనీవినీ ఎరుగరు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 2, 2024, 09:20 AM IST
Gold Rate Hike: పసిడిప్రియులకు షాకింగ్‌ న్యూస్.. ఆల్‌ టైం హైలో తులం బంగారం.. ఎంతో తెలుసా?

Shocking Gold Rate Hike: రికార్డు స్థాయిల్లో గోల్డ్‌ రేట్‌ పెరుగుతూ పసిడి ప్రియులకు బంగారం షాకిస్తుంది. సోమవారం ఏకంగా తులం బంగారం ఎంతకు చేరిందో తెలుసా? ఇది ఇప్పటి వరకు మీరు కనీవినీ ఎరుగరు.. ఇది గోల్డ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్ ఇక మనం బంగారం కొనలేమా? అనే పరిస్థితికి చేరుకుంది..

బంగారం ఇష్టంలేని భారతీయులు ఉంటారా? పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏ వేడుక అయినా బంగారం ఉండాల్సిందే. అంతేకాదు మన భారతీయులకు బంగారం అంటే ప్రీతి ఎక్కువ ఏ మధ్యతరగతి కుటుంబీకులు అయినా వారి స్థోమతకు తగినంతగా పసిడి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం పెళ్లిళ్ల నేపథ్యంలో కూడా బంగారం కొనాలంటే వామ్మో.. ఇంత రేటా? అనే పరిస్థితికి చేరుకుంది. అంతేకాదు, ఇప్పుడున్న బంగారం రేట్లు చూస్తే ఇక మనం భవిష్యత్తులో కొనగలమా? అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అవును, మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు మీరు ఈ ధరలను కనివిని ఎరుగరు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కూడా నడుస్తోంది. ఈ తరుణంలో బంగారం కొనుగోలు గోల్డ్‌ ప్రియులకు ఇది చేదు వార్త. బంగారంతోపాటు వెండి ధరలు కూడా అదే బాటలో పెరుగుతోంది. ఇది సామాన్యులకు షాకింగ్ ఇస్తోంది. అసలు గోల్డ్‌ నిపుణులు కూడా వీటి ధరలు ఎందుకు అమాంతం పెరుగుతున్నాయో ఎప్పటికప్పుడు అంచనా వేయలేకపోతున్నారు. 

ఇదీ చదవండి: బ్యాంక్ కస్టమర్స్‌కు భారీ అలర్ట్.. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీ సెలవులు.. లిస్ట్ ఇదే..

బులియన్ మార్కెట్లో హైదరాబాద్‌ విషయానికి వస్తే సోమవారం నాటికి తులం బంగారం ధర రూ. 71,300 వరకు చేరుకుంది. ఇది 24 క్యారట్ గోల్డ్‌ ధర. మరి 22 క్యారట్‌ గోల్డ్‌ ధర 10 గ్రాములు రూ. 64,000 వేలకు చేరుకుందట. ఇది ఆర్నమెంట్‌ గోల్డ్‌ ధర. ఆల్‌ టైం రికార్డు స్థాయిలో బంగారం ధరలు ఉన్నాయి. ఇది సామన్యులకు అయితే, కచ్చితంగా మింగుడుపడని విషయం. ఈ ఏడాది మార్చి నుంచే గోల్డ్‌ రేటులు పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ ఫస్ట్‌ నాటికి పది గ్రాముల బంగారం ధర రూ. 68,800 వద్ద ఉండేది. అదేవిధంగా పది గ్రాముల బంగారం ధర 22 క్యారట్లు రూ. 63 వేల వద్ద ఉండేది.

ఇదీ చదవండి: త్వరలోనే 2024 మోడల్ మారుతి ఆల్టో 800 రోడ్లపై రయ్‌..రయ్‌, లీక్‌ అయిన ధర, ఫీచర్స్!

ఇక మే ఫస్ట్‌ నాటికి ఆల్ టైం రికార్డు సృషిస్తూ బంగారం కలవరపెడుతోంది. ఇక ఈ ధరలు ట్యాక్స్‌ , జీఎస్టీ మినహాయించి. ఇలా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడానికి ప్రధానం కారణం అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరిగిపోవడం కూడా దేశీయంగా గోల్డ్‌ రేట్‌ పెరగడానికి ప్రధాన కారణం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News