Sony Wireless Earphones Linkbuds: సోని నుండి సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్.. భారీ ధరపై అంతే భారీ ఆఫర్

Sony Wireless Earphones Linkbuds: సోని కంపెనీ మార్కెట్లోకి సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ లింక్‌బడ్స్ లాంచ్ చేసింది. ఓపెన్ రింగ్ డిజైన్‌తో రూపొందిన ఈ ఇయర్‌ఫోన్స్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్వాలిటీ అందిస్తుందని.. చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా వాల్యూమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటుందని సోని స్పష్టంచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 3, 2022, 06:59 PM IST
Sony Wireless Earphones Linkbuds: సోని నుండి సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్.. భారీ ధరపై అంతే భారీ ఆఫర్

Sony Wireless Earphones Linkbuds: సోని కంపెనీ మార్కెట్లోకి సరికొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ లింక్‌బడ్స్ లాంచ్ చేసింది. ఓపెన్ రింగ్ డిజైన్‌తో రూపొందిన ఈ ఇయర్‌ఫోన్స్ క్రిస్టల్ క్లియర్ సౌండ్ క్వాలిటీ అందిస్తుందని.. చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా వాల్యూమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటుందని సోని స్పష్టంచేసింది. అంతేకాకుండా ఆన్‌లైన్ వరల్డ్‌తో ఆఫ్‌లైన్ వరల్డ్‌ని సైతం ఏకకాలంలో అనుసంధానం చేసేలా ఉండటం ఈ ఓపెన్ రింగ్ డిజైన్ ఇయర్ ఫోన్స్‌కి ఉన్న మరో ప్రత్యేకతగా సోని కంపెనీ వెల్లడించింది.

ఈ సోని వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 17.4 గంటలపాటు స్టాండ్‌బై ఉండేలా బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాదు.. కేవలం 10 నిమిషాలు చార్జింగ్ పెడితే చాలు.. 90 నిమిషాలు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని సోని చెబుతోంది.  సోని కంపెనీ స్టోర్లతో పాటు సోని అధికారిక వెబ్‌సైట్ అయిన www.ShopatSC.com అలాగే అన్ని ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో ఈ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ లభిస్తాయని సోని తమ తాజా ప్రకటనలో పేర్కొంది.

ఈ స్పెషల్ ఇయర్ ఫోన్స్ ధర రూ. 19,990 కాగా.. ప్రోడక్ట్ లాంచింగ్ సందర్భంగా రూ. 7 వేల డిస్కౌంట్‌కే ఈ ఇయర్ ఫోన్స్ లభిస్తోంది. అంటే.. 12,990 రూపాయలకే ఈ ఇయర్ ఫోన్స్ సొంతం చేసుకోవచ్చన్న మాట. కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 2000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కలిపే ఈ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్టు సోనీ స్పష్టంచేసింది. ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఆగస్టు 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

Also Read : Poco C31 Smartphone: అద్భుతమైన ఫీచర్లు 12 వేల ఫోన్ కేవలం..249 రూపాయలకే, ఎలాగంటే

Also Read : OnePlus 10T 5G launch: మరి కొద్దిగంటల్లోనే OnePlus 10T 5G లాంచ్, ధర చెబితే ఫోన్ పూర్తిగా ఉచితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News