SBI Loan Will be Costly:ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుంచే అమలు

SBI Base Rate Hike: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్. రేపటి నుంచి ఈఎంఐలు మరింత ప్రియం కానున్నాయి. బేస్ రేట్, బీపీఎల్ఆర్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో బీపీఎల్ఆర్‌తో అనుసంధానమైన లోన్ల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 15, 2023, 09:37 AM IST
SBI Loan Will be Costly:ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుంచే అమలు

SBI Base Rate Hike: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రేపటి నుంచి బేస్ రేట్, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (బీపీఎల్ఆర్)ను పెంచబోతోంది. బ్యాంక్ త్రైమాసిక ప్రాతిపదికన దాని బేస్ రేటు, బీపీఎల్ఆర్‌ పెరుగుతుంది. స్టేట్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. మార్చి 15 నుంచి ఎస్‌బీఐ బీపీఎల్ఆర్ 0.70 శాతం లేదా 70 బేసిస్ పాయింట్లు పెరుగుతుంది. దీని తర్వాత బ్యాంక్ బీపీఎల్ఆర్ 14.85 శాతానికి చేరుతుంది. ప్రస్తుతం బ్యాంక్ బీపీఎల్ఆర్ 14.15 శాతంగా ఉంది.

అంతేకాకుండా బుధవారం నుంచి ఎస్‌బీఐ బేస్ రేటు కూడా 0.70 శాతం లేదా 77 బేసిస్ పాయింట్లు పెరగనుంది. రేపటి నుంచి 10.10 శాతానికి చేరనుంది. బ్యాంక్ ప్రస్తుత బేస్ రేటు 9.40 శాతంగా ఉంది. ఇది చివరిగా డిసెంబర్ 2022లో పొడిగించిన విషయం తెలిసిందే.

ఎస్‌బీఐ ఈ ప్రకటనలతో బీపీఎల్ఆర్‌తో అనుసంధానమైన లోన్ల వడ్డీ రేట్లు కచ్చితంగా పెరుగుతాయి. ఈఎంఐల భారం మరింత పెరగనుంది. ఇది కాకుండా బేస్ రేటు ఆధారంగా లోన్లు తీసుకున్న వారికి కూడా లోన్ వ్యయం పెరగడంతోపాటు ఈఎంఐ కూడా మరింత పెరగనుంది. ఈ నిబంధనలు అన్ని రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. 

అన్ని రుణాలకు వర్తించే కనీస రేటునే బేస్‌రేట్ అంటారు. బీపీఎల్ఆర్ అనేది బేస్ రేటుకు ముందున్న రుణాలకు వర్తించే రేటు. బ్యాంకు ఇచ్చే కొత్త రుణాలు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) లేదా రెపో రేట్ లింక్డ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) ఆధారంగా ఇస్తాయి. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) క్రెడిట్ పాలసీ వచ్చే నెల ఏప్రిల్ 6వ తేదీన రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ వడ్డీ రేట్ల పెంపుదల జరిగింది. ఇందులో కూడా 0.25 శాతం వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 6న రానున్న ద్రవ్య విధానంలో వడ్డీరేట్లలో మరో 0.25 శాతం పెరుగుదల కనిపించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Also Read: TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు.. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్..?

Also Read: Advance Tax: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News