Stocks today: యుద్ధ భయాలున్నా స్టాక్ మార్కెట్ల జోరు- సెన్సెక్స్​ 1329 ప్లస్​

Stocks today: రష్యా-ఉక్రెయిన్ వివాదం కొనసాగుతున్నా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. శుక్రవారం సెషన్​లో సెన్సెక్స్ 1329 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 410 పాయింట్లు పెరిగింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2022, 03:37 PM IST
  • భారీ నష్టాల నుంచి కోలకున్న స్టాక్ మార్కెట్లు
  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలున్నా భారీ రికవరీ
  • అమెరికా సహా వివిధ దేశాల చొరవే కారణం!
Stocks today: యుద్ధ భయాలున్నా స్టాక్ మార్కెట్ల జోరు- సెన్సెక్స్​ 1329 ప్లస్​

Stocks today: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో నష్టాల నుంచి తేరుకున్నాయి. వారాంతపు సెషన్​లో బీఎస్​ఈ- సెన్సెక్స్ 1329 పాయింట్లు పెరిగి.. 55,858 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 410 పాయింట్లు పుంజకుని 16,658 స్థిరపడింది.

యుద్ధ భయాలు ఉన్నా...

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుధ్దం రెండో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్​పై రష్యా బాంబుదాడులు చేస్తోంది. ఉక్రెయిన్ కూడా రష్యా చర్యలకు బదులిస్తోంది. నిన్నటితో పోలిస్తే.. యుద్ధ భయాలు పెరిగినా.. స్టాక్ మార్కెట్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఇందుకు నిపుణులు చెబుతున్న కారణాలు ఏమిటంటే.. రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా సహా బ్రిటన్​, జర్మనీ వంటి దేశాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. ఈ నేపఫథ్యంలో రష్యా కాస్త వెనక్కి తగ్గొచ్చని అంచనాలు ఉన్నాయి. దీనితో స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

అన్ని రంగాలు నేడు లాభాలను గడించాయి. ముఖ్యంగా లోహ, బ్యాంకింగ్, టెక్ కంపెనీలు భారీగా పుంజుకున్నాయి.

ఈ రోజు సెషన్​ గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలు ఇవే..

ఇంట్రాడేలో సెన్సెక్స్ 56,183 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఇది నేటి ఓపెనింగ్ కన్నా తక్కువ. మిడ్​ సెషన్​లో నమోదైన అమ్మకాల కారణఁగా 55,299 వద్దకు పడిపోయింది.

నిఫ్టీ అత్యధికంగా 16,748 పాయింట్ల స్థాయిని తాకింది. ఓ దశలో 17 వేల మార్క్ కోల్పోయి.. 16,478 వద్దకు చేరింది.

నేటి సెషన్​లో టాప్​-5 షేర్లు..

30 షేర్ల ఇండెక్స్​లో 29 షేర్లు లాభాలను ఒక కంపెనీ మాత్రమే స్వల్ప నష్టాలను మూటగట్టుకుంది.

టాటా స్టీల్​ 6.33 శాతం, ఇండస్​ ఇండ్ బ్యాంక్ 5.87 శాతం, బజాజ్ ఫినాన్స్​ 5.16 శాతం, ఎన్​టీపీసీ 4.71 శాతం, టెక్ మహీంద్రా 4.37 శాతం లాభాలను గడగించాయి.

నెస్లే మాత్రం 0.25 శాతం నష్టపోయింది.

Also read: BSNL Cheapest Plan: BSNL చీపెస్ట్ రీఛార్జ్.. రూ.106 రీఛార్జ్ తో 84 రోజుల వ్యాలిడిటీ!

Also read: Bank holidays 2022 March: మార్చిలో 13 రోజులు బ్యాంక్​ సెలవులు- మరిన్ని వివరాలు ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News