Success Story: ఓ బ్యాచిలర్ గదిలో పుట్టిన ఐడియా.. 35వేల కోట్లు సామ్రాజ్యానికి పునాది.. బెజవాడ బ్యాచిలర్ సక్సెస్ స్టోరీ ఇదే

Sriharsha Majeti Success Story: మనదేశంలో ఫుడ్ డెలివరీ అనగానే గుర్తొచ్చేది స్విగ్గి, జొమాటో మాత్రమే. ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థలు కూడా ఈ రెండే. అయితే దేశంలో అత్యంత సక్సెస్ ఫుల్‎గా రన్ అవుతున్న ఈ రెండు ఫుడ్ డెలివరీ యాప్స్‎లో స్విగ్గి సంస్థ అధినేత శ్రీ హర్ష మాజేటి ఓ తెలుగువాడు అని తెలిస్తే మనందరికీ గర్వకారణం అని చెప్పవచ్చు. శ్రీ హర్ష మాజేటి స్థాపించిన స్విగ్గి.. ఒక చిన్న స్టార్ట్‎అప్ నుంచి నేడు 100 కోట్ల డాలర్ల స్థాయిని అందుకున్న యూనికాన్ కంపెనీగా ఎదిగింది.   

Written by - Bhoomi | Last Updated : Sep 30, 2024, 08:36 PM IST
Success Story:  ఓ బ్యాచిలర్ గదిలో పుట్టిన ఐడియా.. 35వేల కోట్లు సామ్రాజ్యానికి పునాది.. బెజవాడ బ్యాచిలర్ సక్సెస్ స్టోరీ ఇదే

Swiggy co-founded  Sriharsha Majeti Success Story: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పుట్టి పెరిగిన శ్రీహర్ష ఆయన తండ్రి ఓ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. తల్లి డాక్టర్. సొంతంగా క్లినిక్ నడుపుతున్నారు. బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తి చేసిన హర్ష ఆ తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్ కూడా పూర్తి చేశాడు. ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం ఉన్న హర్ష.. ఫోటోగ్రఫీ క్లబ్ లో చేరి ప్రపంచమంతా తిరిగాడు. ప్రకృతిని అమితంగా ఇష్టపడే హర్ష దక్షిణ అమెరికా, యూరప్ ఇలా ప్రపంచంలోని అనేక దేశాల్లో సంచరిస్తూ ఫోటోగ్రఫీలో మునిగితేలాడు. అలాంటి శ్రీహర్ష జీవితంలో ఒక మలుపు తిరిగింది. అది కాస్త ఒక వ్యాపార సామ్రాజ్యానికి నాందిగా పలికింది.

బిట్స్ పిలానీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ఉద్యోగాలను శ్రీ హర్ష ఎంపిక చేసుకోలేదు. ఉద్యోగం చేయాలన్న ఆశ లేకపోవడంతో.. తర్వాత ఎంబీఏ కోసం ఐఐఎం కోల్కతాలో చేరాడు. అక్కడే లండన్ కేంద్రంగా పనిచేసే ఓ ట్రేడింగ్ కంపెనీలో చేరాడు. అందులో ఏడాది పాటు పనిచేసి సొంతంగా ఓ స్టార్టప్ ప్రారంభించాలని కృత నిశ్చయంతో తన ప్రయాణం మొదలుపెట్టాడు. తాను లండన్ లో పనిచేస్తున్నప్పుడే ఓ తెలుగు యువకుడు స్థాపించి విజయం సాధించిన రెడ్ బస్ యాప్ సక్సెస్ స్టోరీ అతడిని కదిలించింది. ఇక భవిష్యత్తు అంతా మొబైల్ యాప్స్ ప్రపంచాన్ని మలుపు తిప్పుతాయని అర్థం చేసుకున్నాడు.

 లండన్ లో ఉన్నప్పుడే తన కన్నా రెండేళ్లు జూనియర్ అయినా నందన్ రెడ్డి అనే మరో తెలుగు యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ బిట్స్ పిలానీలో కూడా కలిసి చదువుకున్నారు. రెడ్ బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర శర్మ సాధించిన విజయాన్ని చూసి మొదట అలాంటి ట్రావెలింగ్ ఆధారిత ఆప్ డిజైన్ చేయాలనుకున్నారు. ఆ తరువాత ఈ కామర్స్ సంస్థ స్థాపించాలని కూడా ప్లాన్ చేసుకున్నారు. చివరికి 2013లో తన స్నేహితుడు నందన్ రెడ్డితో కలిసి బెంగళూరులో బండిల్ అనే ఓ కొరియర్ సంస్థలు స్థాపించారు. ముఖ్యంగా లాజిస్టిక్స్ రంగంలో లాస్ట్ మైల్ సర్వీసుల్లో తీవ్రంగా కొరత ఉందని ఊహించిన శ్రీహర్ష ఈ రంగంలో అడుగు పెట్టాడు. నెమ్మదిగా కొరియర్ రంగంలోనే టెక్నాలజీని కనెక్ట్ చేసి తన స్నేహితులతో కలిసి మరిన్ని కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని శ్రీ హర్ష ప్లాన్ చేసుకున్నాడు. అయితే అప్పుడే అతని మెదడులో ఒక చురుకైన ఆలోచన వచ్చింది. బ్యాచిలర్స్ ఇళ్లల్లో వండుకోవడం అనేది దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.

దీన్నే ఒక వ్యాపార అవకాశంగా మలుచుకోవాలని హర్ష ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగు పెట్టాడు. తన కొత్త సంస్థకు స్విగ్గి అని పేరు పెట్టుకున్నాడు. తన స్నేహితుడు సహవ్యవస్థాపకుడైన నందన్ రెడ్డితో కలిసి యాప్ డెవలప్ చేశాడు. 2014 ఆగస్టు నెలలో బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో స్విగ్గి సేవలు ప్రారంభం అయ్యాయి. మొదట 20 రెస్టారెంట్ల నుంచి మెనూలను సేకరించి వెబ్సైట్లో పెట్టారు. కేవలం ఐదుగురు డెలివరీ పార్ట్ నర్ లతో స్విగ్గి యాప్ ప్రారంభమైంది. మొదట్లో రోడ్డుమీద రెస్టారెంట్ల వద్ద పాంప్లెట్లు పంచిపెట్టి స్విగ్గి యాప్ ఇన్స్టాల్ చేసుకోమని అందరికీ ప్రచారం చేసేవారు. 

Also Read: Investment Plan: జస్ట్ రూ. 250లతో ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే చాలు..మీ కూతురు కాలేజీ ఫీజు కట్టేయొచ్చు  

హర్ష, నందన్ ఇద్దరు మార్కెటింగ్ కస్టమర్ రిలేషన్స్ లో ఎప్పుడు బిజీగా ఉండగా మరో స్నేహితుడు రాహుల్ యాప్ డెవలప్మెంట్ కోడింగ్ లో బిజీగా ఉండేవాడు. నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంది. 2015 నాటికి ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా హోటల్స్ బిజినెస్ స్విగ్గి వల్ల రెండింతలు అయిందని అప్పటివరకు స్విగ్గితో జత కట్టిన యజమానులు పేర్కొన్నారు. ఎందుకంటే అప్పట్లో కేవలం హోటల్కు వచ్చే కస్టమర్ల ద్వారా మాత్రమే ఆదాయం లభించేది. కానీ స్విగ్గి వల్ల డెలివరీ బాగా పెరిగాయి. దీంతో వారి వ్యాపారం కూడా రెండింతలు అయింది. ఇది గమనించిన   ఇన్వెస్టర్లు స్విగ్గిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

 యాక్సెల్ ఎస్ ఏ ఐ ఎఫ్ పార్ట్నర్స్ వంటి సంస్థలు దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాయి. అంతేకాదు స్విగ్గి నెమ్మదిగా దేశమంతటా పాకింది. సుమారు రెండు నుంచి మూడు వందల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. కేవలం రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు మాత్రమే కాదు క్లౌడ్ కిచెన్ లను కూడా 2017 లో ఏర్పాటు చేశారు. 2018 నాటికి స్విగ్గి విలువ 1.3 బిలియన్లకు స్థాయికి చేరింది. స్విగ్గి కేవలం ఫుడ్ డెలివరీ కి మాత్రమే పరిమితం కాలేదు. నెమ్మదిగా సూపర్ డైలీ ఇన్ స్ట మార్ట్ వంటి నిత్యవసర సరుకులను డోర్ డెలివరీ చేసే సంస్థలను ప్రారంభించారు. 

ఈరోజు శ్రీహర్ష మాజేటి దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఒక ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం 1400 కోట్ల రూపాయల విలువైన సంపదతో శ్రీ హర్ష మాజేటి శ్రీమంతుల లిస్టులో చేరాడు. అంతేకాదు ప్రస్తుతం స్విగ్గి మార్కెట్ విలువ తాజాగా 35 వేల కోట్లు దాటింది. దాదాపు 2,000 మంది రెండు లక్షల మంది డెలివరీ పార్ట్నర్స్ స్విగ్గితో ఉపాధి పొందుతున్నారు.

Also Read: Profitable Business Ideas For Women: కేవలం రూ.10 వేలతో ఒక్క మిషన్ కొని ఈ బిజినెస్ చేస్తే.. నెలకు రూ.50 వేలు సంపాదించడం పక్కా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News