Toyota Innova Bookings: డిమాండ్ తట్టుకోలేక చేతులెత్తేసిన ఇన్నోవా, బుకింగ్స్ నిలిపివేత

Toyota Innova Bookings: దేశీయ కార్ మార్కెట్‌లో కొద్దికాలంగా ఎస్‌యూవీ లేదా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. 7 సీటర్ కారనగానే ముందుగా గుర్తొచ్చేది ఇన్నోవా. టొయోటా కంపెనీకు చెందిన ఇన్నోవా అంతగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు అదే కంపెనీకు చెందిన ఇన్నోవా హైక్రాస్‌కు మరీ డిమాండ్ పెరిగిపోయిది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 21, 2024, 01:41 PM IST
Toyota Innova Bookings: డిమాండ్ తట్టుకోలేక చేతులెత్తేసిన ఇన్నోవా, బుకింగ్స్ నిలిపివేత

Toyota Innova Bookings: 2022 డిసెంబర్ నెలలో లాంచ్ అయిన టొయోటా ఇన్నోవా హైక్రాస్ అత్యధికంగా విక్రయమౌతోంది. ముఖ్యంగా ఇండియాలో ఉన్న డిమాండ్ తట్టుకోలేక కంపెనీ బుకింగ్ నిలిపివేసింది. ఎందుకింత డిమాండ్, ఫీచర్లు ఏంటనేది తెలుసుకుందాం.

టొయోటా ఇన్నోవా హైక్రాస్‌లో టాప్ మోడల్ కార్లు ZX,ZX(o)బుకింగ్స్‌ను కంపెనీ ఏప్రిల్ 2023 నుంచే నిలిపివేసింది. ఏడాది తరువాత తిరిగి మొన్న ఏప్రిల్ నుంచి బుకింగ్స్ ప్రారంభించింది. మళ్లీ డిమాండ్ అధికంగా ఉండటంతో బుకింగ్స్ మళ్లీ నిలిపివేసింది. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోవడం వల్ల బుకింగ్స్ నిలిపివేయాల్సి వచ్చింది. హైబ్రిడ్ వేరియంట్ కార్లకు వెయిటింగ్ పీరియడ్ దాదాపుగా 15 నెలలకు చేరుకుంది. వెయిటింగ్ పీరియడ్ తగ్గితే తిరిగి బుకింగ్స్ ప్రారంభం కావచ్చు. అయితే మిడ్ లెవెల్ మోడల్స్ VX, VX(o) హైబ్రిడ్ బుకింగ్స్ జరుగుతున్నాయి. 50 వేల అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. వీటికి వెయిటింగ్ పీరియడ్ కేవలం 3 నెలలుంది. 

ఇటీవల ఇన్నోవా నుంచి కొత్తగా Toyota Innova Hycross GX(o) మోడల్ లాంచ్ అయింది. ఈ కారు ప్రారంభధర 20.99 లక్షలు రూపాయలుంది. ఇది పాత వేరియంట్ జీఎక్స్ కంటే 1 లక్ష రూపాయలు అధికం. ఈ మోడల్ కారు 7-8 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 10.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్లున్నాయి. ఇవి కాకుండా డ్యూయల్ టోన్ ఇంటీరియర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ టోన్ సీట్లు, అద్భుతమైన డ్యాష్‌బోర్డ్, ఎల్ఈడీ ఫ్రాంగ్ ల్యాంప్స్, 360 డిగ్రీ కెమేరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ ఉన్నాయి. 

టొయోటా ఇన్నోవా హైక్రాస్ జీఎక్స్ ( ఓ) పెట్రోల్ వేరియంట్‌లో 2.0 లీటర్, 4 సిలెండర్ పెట్రోల్ ఇంజన్, 173 హార్స్ పవర్, 209 ఎన్ఎం టార్క్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంటుంది. దాంతోపాటు 2.0 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఇది 184 హార్స్ పవర్ కలిగి ఉంటుంది. హైబ్రిడ్ కారు లీటర్‌కు 23.24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అదే రెగ్యులర్ పెట్రోల్ కారు అయితే 16.13 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 

Also read: Infinix Hot 40i: 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 50MP కెమేరాతో సూపర్‌ఫోన్ కేవలం 9 వేలకే

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News