కేవలం 50 రూపాయల ఫీజు చెల్లించి ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అయితే మీ అడ్రస్‌ను నిర్ధారించేందుకు కుటుంబ పెద్ద బయోమెట్రిక్ తప్పనిసరి అవుతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఆధార్ కార్డు భారతదేశ పౌరులకు ఓ విశిష్ట గుర్తింపు కార్డు. దేశంలో ప్రతి పనికీ అత్యంత అవసరంగా మారింది. అందుకే ఆధార్ కార్డు విషయంలో యూఐడీఏఐ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తోంది. ఆధార్ కార్డు యూజర్లు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు చాలా సౌలభ్యాలు కల్పిస్తోంది. ఇప్పుడిక ఆధార్ కార్డులో మీ కుటుంబసభ్యుల చిరునామాను చాలా సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. సరైన ఆధార పత్రాలు లేకపోయినా కుటుంబ పెద్ద ఆధార్ కార్డు అప్‌డేట్ అయుంటే చాలు..ఇతర సభ్యుల ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు సాధ్యమౌతుంది.
కుటుంబ యజమాని ఆధార్ కార్డు సహాయంతో ఇతర కుటుంబసభ్యులకు వ్యక్తిగత సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకపోయినా ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేయవచ్చు. అయితే కుటుంబ యజమాని ఆధార్ కార్డు అడ్రస్ మాత్రం అప్‌డేట్ అయుండాలి. కుటుంబ యజమానితో ఆ వ్యక్తి ఉన్న బంధం ఉదాహరణకు తండ్రి, తల్లి, కూతురు, కుమారుడు, భార్య వంటి వివరాలు నమోదు చేయాలి. ధృవీకరణ కోసం కుటుంబ యజమాని బయోమెట్రిక్ ఫింగర్ ఫ్రింట్స్ అవసరమౌతాయి. అంటే ఆధార్ సేవాకేంద్రంలో అడ్రస్ అప్‌డేట్ సమయంలో కుటుంబ యజమాని తప్పకుండా హాజరుకావాలి.
రిలేషన్ షిప్ రుజువు చేసేందుకు పాస్‌పోర్ట్, రేషన్ కార్డు లేదా పీడీఎస్ కార్డు, లేదా పెన్షన్ కార్డు, వివాహ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లు ఒకవేళ లేకపోతే కుటుంబ యజమాని మీతో రిలేషన్ షిప్ విషయంలో ఇచ్చే సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం సరిపోతుంది. అయితే ఇది మూడు నెలలకే వర్తిస్తుంది. ఆధార్ కార్డు అడ్రస్ అప్‌డేట్ చేసేందుకు 50 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Also read: SUV Cars: హ్యుండయ్ న్యూ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది లేనట్టే, మారుతి, కియాలకు లబ్ది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook