SUV Cars: హ్యుండయ్ న్యూ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది లేనట్టే, మారుతి, కియాలకు లబ్ది

SUV Cars: ప్రముఖ కార్ల కంపెనీ హ్యుండయ్ నుంచి కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్ మరింత ఆలస్యం కానుంది. ఆటో ఎక్స్‌పో 2023లో షోకేస్ చేయాల్సిన ఉన్నా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఫలితంగా మారుతి, కియా కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 18, 2023, 03:04 PM IST
SUV Cars: హ్యుండయ్ న్యూ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది లేనట్టే, మారుతి, కియాలకు లబ్ది

మొన్నటివరకూ వచ్చిన మీడియా నివేదికల ప్రకారం హ్యుండయ్ తన కొత్త క్రెటాను ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించనుంది తెలిసింది. అయితే ఇప్పుడది ఆలస్యమౌతోంది. ఇండోనేషియాలో ఇప్పటికే విక్రయమౌతున్న న్యూ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది లాంచ్ కావచ్చనే అనుమానాలున్నాయి.

క్రెటా అనేది పూర్తి విభిన్నమైన మోడల్ తయారు చేస్తోందని..అందుకే ఇండియన్ మార్కెట్‌లో న్యూ క్రెటా ఎస్‌యూవీ మోడల్ కింద లాంచ్ ఆలస్యమైందని హ్యుండయ్ కంపెనీ వెల్లడించింది. హ్యుండయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్‌ను 2023లో కాకుండా 2024లో లాంచ్ చేయవచ్చు. హ్యుండయ్ కంపెనీ న్యూ క్రెటా కోసం ఎదురుచూసిన కస్టమర్లకు పెద్దఎత్తున నిరాశే ఎదురైంది. 

మారుతి, కియాలకు ప్రయోజనం

హ్యుండయ్ క్రెటా..ఆ కంపెనీ సెగ్మెంట్‌లో అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్‌యూవీ. తరువాత రెండవస్థానంలో కియా సెల్టోస్ ఉంది. మారుతి కంపెనీ కూడా గత ఏడాది గ్రాండ్ విటారా లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం విక్రయాల్లో క్రెటా, సెల్టోస్ తరువాతే నిలిచింది. కానీ సి సెగ్మెంట్‌లో పోటీని పెంచేసింది. ఒకవేళ హ్యుండయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ ఏడాది జరగకపోతే..పాత టెక్నాలజీతో పోలిస్తే కొత్త టెక్నాలజీ, ఫీచర్లు కీలకంగా మారుతాయి. ఎందుకంటే గ్రాండ్ విటారా కొత్త ఉత్పత్తి. కొత్త టెక్నాలజీతో వచ్చింది. 

అదే సమయంలో కియా సెల్టోస్ గురించి పరిశీలిస్తే..ఈ ఏడాది సెల్టోస్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేయవచ్చు. ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకురావచ్చు. దీంతో కస్టమర్లు సెల్టోస్ వైపు ఆకర్షితులు కావచ్చు. క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న వారంతా సెల్టోస్‌కు మరలిపోవచ్చు. మొత్తానికి హ్యుండయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది లాంచ్ కానందున..ఆ లాభం మారుతి, కియా కంపెనీలకు దక్కనుంది.

Also read: Old vs New Pension Scheme: ఓల్డ్ అండ్ న్యూ పెన్షన్ పథకాల మధ్యం అంతరం తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News