Gang Rape on A Software Engineer at Jharkhand : యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః* యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురాః క్రియాః అంటే ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలను దేవతగా భావించి పూజిస్తారో, అక్కడ సర్వసంపదలు ఉండడమే కాక రధ, గజ, తురగ పదాదులతో కూడిన లక్ష్మీ దేవి అచంచలయై నిలబడుతుందని వేదాలు చెప్పడమే కానీ దాన్ని మృగాళ్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. జార్ఖండ్‌లోని చైబాసాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఒక ఒక గిరిజన యువతిపై 10 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ కేసులో పోలీసులు పదిమంది పై కేసులు పెట్టినా ఒక్క అరెస్ట్ కూడా చేయలేకపోయారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చి 40 గంటలకు పైగా గడిచినా.. పోలీసులు ఇప్పటి వరకు ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేదు. బాధితురాలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని ఆమె చైబాసాలో ఉంటూ తన కంపెనీకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. గురువారం సాయంత్రం ఆమె స్నేహితుడితో కలిసి స్కూటీపై తిరిగేందుకు ఎయిర్‌స్ట్రిప్‌కు వెళ్లగా అక్కడ ఉన్న 8 నుంచి 10 మంది యువకులు ఆమె స్నేహితుడిని బెదిరించి, యువతిని పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.
ఆరోజు రాత్రి పోలీసులకు దీనిపై సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ శేఖర్ వెల్లడించారు. మొత్తం 10 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మూడేళ్లలో రాష్ట్రంలో 5000 అత్యాచార ఘటనలు జరిగాయని ఆరోపిస్తోంది.
అత్యాచారం అనంతరం నిందితులు బాధితురాలిని అక్కడే వదిలి పారిపోయారు అయితే అప్పుడే ఆమె పర్సు, మొబైల్ ఫోన్ కూడా లాక్కున్నారు. దీంతో బాధితురాలు ఎలాగోలా తన ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతిని సదర్ ఆస్పత్రిలో పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు, ఆమె ఎవరినీ కలవడానికి అనుమతించడం లేదు. ఇక ఈ అంశం మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి ఉంది.
Also Read: Anu Emmanuel : ఈవెంట్ ముగిసే టైంకి వచ్చిన అను ఇమాన్యుయేల్.. చురకలు వేసిన అల్లు అరవింద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook