Aadujeevitham: The Goat Life: మనసు కదిలించే నజీబ్ రియల్ లైఫ్ స్టోరీ.. పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్'.. ఆడు జీవితం..

Prithviraj Sukumaran - Aadujeevitham: The Goat Life: మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. లీడ్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'ఆడు జీవితం.. ది గోట్ లైఫ్'.  ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో  విడుదల కాబోతుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 27, 2024, 05:26 PM IST
Aadujeevitham: The Goat Life: మనసు కదిలించే నజీబ్ రియల్ లైఫ్ స్టోరీ..  పృథ్వీరాజ్ సుకుమారన్  'ది గోట్ లైఫ్'.. ఆడు జీవితం..

Prithviraj Sukumaran - Aadujeevitham: The Goat Life:మల్లూవుడ్  స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా లెవల్లో మేజర్ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ సినిమాకు మూలమైన నజీబ్ గురించి ప్రచార కార్యక్రమాల్లో మూవీ టీమ్ చెబుతున్న విషయాలు ప్రేక్షకుల మనసులను కదలిస్తున్నాయి.90లలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి అరబ్ దేశాలకు వలస వెళ్లాడు నజీబ్ అనే అమాయక యువకుడి కథే 'ది గోట్ లైఫ్.. ఆడు జీవితం'. ఎంతోమంది లాగే అతనూ గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసపోతాడు. రెండేళ్లు ఎడారిలో ప్రయాణిస్తూ అనేక కష్ట నష్టాలు పడతాడు. 700 గొర్రెలను కాపాడుకుంటూ అతని ఎడారి ప్రయాణం ఎంతో శ్రమతో  సాగుతుంది. నజీబ్ కు ఉన్న ఒకే జత బట్టలతో స్నానం చేసి దుస్తులు మార్చుకునేందుకు కూడా వీలుండదు.

తినేందుకు సరైన ఆహారం దొరక్క విపరీతమైన ఎడారి వాతావరణంలో నజీబ్ ఎవరు ఊహించని కష్టాలు ఎదుర్కొంటాడు. ఒక దశలో నజీబ్ కు మనిషి మీద మానవత్వం మీద నమ్మకం పోతుంది. తాను కాపాడుకుంటున్న గొర్రెల్లో తానూ ఒక గొర్రెగానే భావించుకుంటాడు. 8 నెలల గర్భవతి అయిన భార్యను వదిలి విదేశీ ఉద్యోగానికి బయలు దేరిన నజీబ్ కు ఇప్పుడు  తనకు పుట్టిన బిడ్డ ఎలా ఉందో తెలియదు. వారి జ్ఞాపకాలతో ఎంతో ఊరట చెందుతుంటాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తాడు. కొన్నేళ్ల తర్వాత చివరకు తన కుటుంబానికి తన దేశానికి ఎలా తిరిగొచ్చి తన కుటుంబ సభ్యులకు ఎలా దగ్గరయ్యాడు. నజీబ్ సాగించిన ఈ సాహసోపేత ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తికరంగా నిలుస్తోంది. నజీబ్ జీవితంలోని ఈ భావోద్వేగాలన్నీ "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాలో అత్యంత నాచురల్‌గా పిక్చరైజ్ చేశారు.

నటీనటులు - పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

ఎడిటర్ - శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ - సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ - రసూల్ పూకుట్టి
మ్యూజిక్ - ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
నిర్మాణం - విజువల్ రొమాన్స్
దర్శకత్వం - బ్లెస్సీ

 

Trending News