Corona virus: కోలుకున్న బిగ్ బి కుటుంబం, అభిషేక్ కు సైతం నెగెటివ్

బిగ్ బి కుటుంబం ( Big B Family ) కరోనాను జయించేసింది. అమితాబ్ బచ్చన్ తో సహా కుటుంబమంతటికీ సోకిన కరోనా వైరస్ ఇప్పుడు నిష్క్రమించింది. కుటుంబంలో చివరి వ్యక్తి అభిషేక్ బచ్చన్ ( Abhishek bachan ) కూడా పూర్తిగా కోలుకున్నారు. నిర్దారణ పరీక్షలో నెగెటివ్ వచ్చిందని సంతోషంతో అభిషేక్ ట్వీట్ చేశాడు.

Last Updated : Aug 8, 2020, 03:56 PM IST
Corona virus: కోలుకున్న బిగ్ బి కుటుంబం, అభిషేక్ కు సైతం నెగెటివ్

బిగ్ బి కుటుంబం ( Big B Family ) కరోనాను జయించేసింది. అమితాబ్ బచ్చన్ తో సహా కుటుంబమంతటికీ సోకిన కరోనా వైరస్ ఇప్పుడు నిష్క్రమించింది. కుటుంబంలో చివరి వ్యక్తి అభిషేక్ బచ్చన్ ( Abhishek bachan ) కూడా పూర్తిగా కోలుకున్నారు. నిర్దారణ పరీక్షలో నెగెటివ్ వచ్చిందని సంతోషంతో అభిషేక్ ట్వీట్ చేశాడు.

కరోనా వైరస్ ( Corona virus ) ఎవర్నీ వదలడం లేదు. బాలీవుడ్ ( Bollywood ) లో చాలామందికి సోకినట్టే అమితాబ్ కుటుంబానికి ( Amitabh family ) కూడా కరోనా వైరస్ సోకింది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, ఆమె కుమార్తెతో సహా అందరికీ కరోనా నిర్ధారణ కావడంతో నానావతి ఆసుపత్రిలో ( Nanavati Hospital ) చికిత్స తీసుకున్నారు. ముందుగా ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె డిశ్చార్జ్ కాగా అనంతరం అమితాబ్ బచ్చన్ డిశ్చార్జ్ అయ్యారు. చివరిగా ఇప్పుడు తాను కూడా కోలుకున్నానని...రిపోర్ట్ నెగెటివ్ గా వచ్చిందని అభిషేక్ బచ్చన్ ( Abhishek bachan tweet ) ట్వీట్ చేశారు. బిగ్ బి కుటుంబానికి కరోనా వైరస్ సోకిందని తెలియగానే బాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ల ద్వారా తమ సానుభూతి తెలిపారు. తన కోసం తన కుటుంబం కోసం ప్రార్ధనలు చేసినవాళ్లందరికీ చేతులెత్తి నమస్కారం చేశాడు అభిషేక్ బచ్చన్. నానావతి ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సేవలకు సదా రుణపడి ఉంటానని చెప్పాడు అభిషేక్ బచ్చన్. Also read: #JusticeForSushantSinghRajput: సుశాంత్ కు న్యాయం జరగాలని అమెరికాలో...

 

Trending News