Maidaan new poster: ‘మైదాన్’పై అంచనాలు పెంచుతున్న కొత్త పోస్టర్

Ajay Devgn । ఇటీవల కాలంలో బయోపిక్‌లు, ఆటలు ఆధారంగా వస్తున్న సినిమాలకు ప్రజాధరణ లభిస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ మరో బయోపిక్‌లో నటిస్తున్నాడు.

Last Updated : Jan 28, 2020, 12:32 PM IST
Maidaan new poster: ‘మైదాన్’పై అంచనాలు పెంచుతున్న కొత్త పోస్టర్

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ మరాఠా యోధుడు తనాజీ మలుసరే జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కించిన సినిమాతో సక్సెస్ సాధించాడు. అయితే తనాజీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ కూర్చోకుండా మరో ఆసక్తికర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు అజయ్. తన లేటెస్ట్ సినిమా ‘మైదాన్’ సినిమా ఫస్ట్ లుక్ మంగళవారం రిలీజ్ చేశాడు. నవంబర్ 27న విడుదల చేయబోతున్నట్లు తేదీని తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అజయ్ దేవగ్ ట్వీట్ చేశాడు.

అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వంలో అజయ్‌ దేవగన్‌ హీరోగా మైదాన్‌ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి. కాగా, భారత ఫుట్‌బాల్‌ మాజీ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా మైదాన్ మూవీని తెరకెక్కిస్తున్నారు. అజయ్ దేవగణ్ భార్య పాత్రకు తొలుత కీర్తి సురేష్‌ను తీసుకున్నారు.

Photo Gallery: మిని స్కర్ట్‌లో ‘మలాంగ్’ భామ.. ఫొటోల కోసం క్లిక్ చేయండి

అయితే ఆమె బరువు తగ్గారని, పాత్రకు న్యాయం చేయలేనని ప్రాజెక్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ పోషించాల్సిన పాత్రకు ప్రియమణిని సెలక్ట్ చేశారు. జీ స్టూడియోస్‌, బోని కపూర్‌, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సెంగుప్త నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. ప్రియమణి ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’ మూవీలో శశికళ పాత్ర పోషిస్తోంది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News