Poorna as lady villain: బ్యూటీఫుల్ హీరోయిన్‌ లేడీ విలన్ ఐతే..?

ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోయిన్స్ విలన్ పాత్రలు పోషించడం సర్వసాధారణమైంది. ఇటీవల వరలక్ష్మి శరత్‌కుమార్ చాలా సినిమాల్లో ఇలాంటి పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు నటి పూర్ణ ( Actress Poorna ) కూడా విలన్‌గా మారబోతోంది.

Last Updated : Sep 26, 2020, 02:02 AM IST
Poorna as lady villain: బ్యూటీఫుల్ హీరోయిన్‌ లేడీ విలన్ ఐతే..?

ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోయిన్స్ విలన్ పాత్రలు పోషించడం సర్వసాధారణమైంది. ఇటీవల వరలక్ష్మి శరత్‌కుమార్ చాలా సినిమాల్లో ఇలాంటి పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు నటి పూర్ణ ( Actress Poorna ) కూడా విలన్‌గా మారబోతోంది. పూర్ణ అకా షామ్నా ఖాసిం తెలుగులో 'సీమ టపాకాయ్', ‘అవును’, ‘అవును2’, 'అవంతిక' వంటి చిత్రాల్లో నటించిన పూర్ణను తాజాగా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా ( Director Vijay Kumar Konda ) తన తరువాతి చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి సంప్రదించినట్టు టాక్. ఈ ప్రాజెక్టుకి పూర్ణ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా డైరెక్షన్‌లో యువ హీరో రాజ్ తరుణ్ నటించిన రొమాంటిక్ అండ్ కామెడీ చిత్రం ‘ఒరే బుజ్జిగా’ ( Raj Tarun's Orey Bujjigaa movie ) అక్టోబర్ 2 న ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. అదే రోజున విడుదలయ్యే అనుష్క శెట్టి 'నిశ్శబ్దం' సినిమాతో ( Nishabdam ) రాజ్ తరుణ్ పోటీ పడబోతున్నాడు. Also read : Sai Pallavi in Pushpa: పుష్ప సినిమాలో సాయి పల్లవి

‘ఓరే బుజ్జిగా’ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా డైరెక్షన్‌లో రాజ్ తరుణ్ మరో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పూజా వేడుకతో ప్రారంభించిన ఈ చిత్రం కోసం  ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ సినిమాకి అనూప్ రెబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. పూర్ణను లేడీ విలన్‌గా తీసుకుంటుంది కూడా ఈ సినిమా కోసమే. మొత్తానికి డైరెక్టర్ విక్రమ్ కుమార్ కొండా బ్యూటీఫుల్ హీరోయిన్‌ని మరో లేడీ విలన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడన్న మాట.

ఇక ప్రస్తుతం పూర్ణ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. 'లాకప్', '100', 'తలైవి' చిత్రాలతో పాటు మరో తమిళ సినిమాకు కూడా పూర్ణ సైన్ చేసింది. Also read : SP Balasubrahmanyam: బాలుకు, సూపర్ స్టార్ కృష్ణకు మధ్య విభేదాలు.. ఆరోజు ఏం జరిగిందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News