లెజెండరి సింగర్‌గా ఎంతో గొప్ప పేరున్నప్పటికీ ఎలాంటి వివాదాల్లో తలదూర్చని వ్యక్తిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ( SP Balasubrahmanyam ) మంచి పేరుంది. అలాంటి బాలుకు వివాదాలకు దూరంగా ఉండే సూపర్ స్టార్ కృష్ణకు ( Super star Krishna ) మధ్య ఓ విషయంలో తీవ్ర విభేదాలు తలెత్తాయంటే నమ్మగలరా ? అవును.. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు తాను నిజంగానే మూడేళ్లపాటు పాటలు పాడలేదని స్వయంగా బాలునే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకు గల కారణాన్ని సైతం బాలు వివరించారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాటల్లో ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటే.. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఓ సినిమాకు బాలు పాటలు పాడగా.. ఆ చిత్ర నిర్మాత మాత్రం నాలుగేళ్లపాటు ఆ పాటలకు సంబంధించిన పారితోషికం ( SPB remuneration ) ఇవ్వకుండా కాలం గడిపారట. ఐతే అదే సమయంలో తనకు డబ్బులు అత్యవసరం పడటంతో తన పారితోషికం చెల్లించాల్సిందిగా బాలు ఆ చిత్ర నిర్మాతను కోరగా, అందుకు ఆయన స్పందించిన విధానం నచ్చలేదట. నీ డబ్బులు ఎక్కడికి పోతాయి, మేమెక్కడికి పోతాం.. ఇంకా వేరే సినిమాల్లో పాటలు పాడేది ఉంది కదా.. ఆ పాటలతో సహా ఒక్కసారే లెక్కచేసి ఇచ్చేస్తాలే అనే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా సూపర్ స్టార్ కృష్ణకు ఫోన్ చేసి.. బాలు డబ్బుల కోసం గొడవపడుతున్నాడని ఉన్నవి లేనివి చెప్పాడట. Also read : SP Balasubrahmanyam died: బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక తీరకుండానే..
నిర్మాత చెప్పిన మాటలతో కోపం తెచ్చుకున్న కృష్ణ.. వెంటనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఫోన్ చేసి సీరియస్ అయ్యారట. '' ఏమయ్యా బాలు నువు పాడకుంటే నా సినిమాల్లో పాటలు పాడేవారే ఉండరని.. సినిమాలే విడుదల కావని అన్నావంట.. నువ్వు కాకుండా వేరే వాళ్లు ఎవరు పాడుతారో, ఎలా పాడుతారో చూస్తానని బెదిరించావట'' అంటూ బాలుపై కృష్ణ ఆగ్రహం వ్యక్తంచేయడం.. అయ్యో అలాంటిదేమీ లేదండి అని బాలు సర్దిచెప్పే ప్రయత్నం చేయడం వెనువెంటనే జరిగిపోయాయంట. ఐతే.. ఆ సమయంలో బాలుపై కొంత కోపంలో ఉన్న కృష్ణ.. ఆయన చెప్పిన వివరణ వినిపించుకోకుండానే.. '' నీకు రావాల్సిన డబ్బులకు సంబంధించిన చెక్ నేను పంపిస్తాను కానీ మీరు పరిచయం చేసిన మీ మిత్రుడి నుంచి తనకు రూ. 20 వేలు వచ్చేది ఉందని.. అవి మీరు ఇస్తారా'' అని అడిగారంట. అంతేకాకుండా వెంటనే బాలుకు నిర్మాత నుంచి రావాల్సిన రూ.800 చెక్ రాసి పంపిచ్చారంట.
నిర్మాత చెప్పిన మాటలకు సూపర్ స్టార్ కృష్ణ గారు తనపై కోపం తెచ్చుకున్నారని అర్థం చేసుకున్న SP Balu.. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తనకు రావాల్సిన పారితోషికం రూ.800 తానే ఎక్కువ తిరిగి చెల్లించానని.. అప్పటి నుండి రెండు, మూడేళ్ల పాటు సూపర్ స్టార్ కృష్ణ, తాను ఎక్కడైనా తారసపడితే మాట్లాడుకునే వాళ్లమే కానీ ఆయన సినిమాకు పాటలు పాడలేదని బాలు గుర్తుచేసుకున్నారు. Also read : SP Balasubrahmanyam died: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు
ఆ ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత రాజ్-కోటి ( Raj-koti music ) ద్వయం కృష్ణ గారి సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసే క్రమంలో ఆ సినిమా కోసం తనని పాట పాడాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారంట. ఐతే సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకు తాను పాటలు పాడటం లేదని.. తమ మధ్య పాటల పరంగా గ్యాప్ వచ్చిందని బాలు ఎంత చెప్పినా వినకపోవడంతో పాటు.. అవసరమైతే మీ ఇద్దరి మధ్య మీటింగ్ అరేంజ్ చేస్తామని.. మీరూ మీరూ మాట్లాడుకుని ఆ మనస్పర్ధలు లేకుండా చేసుకునైనా సరే తమ సినిమాకు పాట పాడాల్సిందేనని రాజ్-కోటి బలవతం చేశారట.
ఐతే, సూపర్ స్టార్ కృష్ణ చాలా పెద్దోళ్లని.. అటువంటిది ఆయనతో ఇంకెక్కడో మీటింగ్ పెట్టుకోవడం ఎందుకనే ఉద్దేశంతో తానే స్వయంగా ఆయన ఆఫీసుకు వెళ్లి కలిశానని ఆనాటి సందర్భాన్ని బాలు గుర్తుచేసుకున్నారు. మూడేళ్ల తర్వాత తమ ఆఫీసులో అడుగుపెట్టిన తనని చూసి కృష్ణ గారి ఆఫీసు సిబ్బంది అంతా ఆశ్చర్యపోవడం.. తాను కృష్ణ గారి గదిలోకి వెళ్లి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ... ఆయన మాత్రం ఏదీ మనసులో పెట్టుకోకుండా గతం గతః ఇప్పుడవన్నీ ఎందుకు.. మనం కలిసి పని చేద్దామని ఆయన సినిమాలో మళ్లీ పాటలు పాడే ఆఫర్ ఇచ్చారంటూ బాలు తన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. Also read : SP Balu's funeral: రేపు గానగంధర్వుడి అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణలో ఉన్న గొప్పతనాన్ని, ఎవ్వరూ తనకు పాడేందుకు అవకాశం ఇవ్వని రోజుల్లో ఆయన సినిమాల్లో పాడే అవకాశం ఇచ్చి అండగా నిలిచిన రోజులని కూడా బాలు గుర్తుచేసుకున్నారు. కృష్ణ గారు బోళా శంకరుడు లాంటి వారని.. ఎవరైనా నిర్మాతలు పారితోషికం ఇవ్వకపోయినా.. సినిమా హిట్టయితే వాళ్లే ఇస్తారులే అని సర్ధుకుపోయే వారి కానీ ఏనాడూ నిర్మాతలతో గొడవపడే వారు కాదని బాలు చెప్పుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe