Samantha: సమంతా ఇంట్లో పెను విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి..

Samantha Ruth Prabhu father: సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూసినట్లు తెలుస్తొంది.   

Written by - Inamdar Paresh | Last Updated : Nov 29, 2024, 05:20 PM IST
  • సామ్ ఇంట్లో విషాదం..
  • ఆందోళనలో ఫ్యాన్స్..
Samantha: సమంతా ఇంట్లో పెను విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి..

Samantha father passedaway: సమంతా రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సామ్ తన ఇన్ స్టాలో ఎమోషనల్ స్టోరీని పోస్ట్ చేశారు. సమంత ఇటీవల సిటాడెల్ బన్నీ వెబ్ సిరిస్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 

ఈ ఘటనతో సమంతా అభిమానులు సైతం షాక్ ను గురిచేస్తుందంట. అసలు.. ఆయన చనిపోవడానికి కారణమేంటని చాలా మంది ఎక్స్ వేదికగా కామెంట్లు చేస్తున్నారంట. మరోవైపు ఈ విషాదకర సమయంలో సమంతకు ఆ దేవుడు ధైర్యంను ఇవ్వాలని కూడా ప్రార్థిస్తున్నారంట. సమంతా చెన్నైలో జోసెఫ్ ప్రభు , నినెట్ ప్రభు దంపతులకు జన్మించినట్లు తెలుస్తుంది.  

జోసెఫ్ ప్రభు ఒక ఆంగ్లో ఇండియన్. చిన్నతనం నుంచి సామ్ కు తన తండ్రితో ఒక గొప్ప అటాచ్ మెంట్ ఉందంట. ఈ క్రమంలో సినిమాల్లో రావడానికి ఆమె తండ్రి ఎంతో సపోర్ట్ ఇచ్చారంట. ఈ క్రమంలో సామ్ ఇన్ స్టాలో హర్ట్ బ్రేకింగ్ ఎమోజీని పోస్ట్ చేసి.. తన తండ్రి చనిపోయారనే వార్తను షేర్ చేసినట్లు తెలుస్తొంది. దీంతో సామ్ అభిమానులు, ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Trending News