హీరోయిన్‌ స్నేహకి బెదిరింపులు..ఇద్దరు వ్యాపారవేత్తలపై కేసు

Sneha lodges police complaint :చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తన వద్ద డబ్బు తీసుకొని ఇవ్వడం లేదంటూ పోలీసులకు (police) ఫిర్యాదు చేసింది స్నేహ. వారి వ్యాపారం నిమిత్తం తన వద్ద 26 లక్షల రూపాయలు (26 lakhs) తీసుకున్నారని స్నేహ ఫిర్యాదులో పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 09:54 PM IST
  • హీరోయిన్‌ స్నేహకు బెదిరింపులు
  • చెన్నైలోని కానత్తుర్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించిన స్నేహ
  • ఇద్దరు వ్యాపారవేత్తలు డబ్బు తీసుకొని ఇవ్వకుండా బెదిరిస్తున్నారని ఫిర్యాదు
హీరోయిన్‌ స్నేహకి బెదిరింపులు..ఇద్దరు వ్యాపారవేత్తలపై కేసు

Actress Sneha lodges police complaint against on two business men: హీరోయిన్‌ స్నేహకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమె తాజాగా చెన్నైలోని (Chennai) కానత్తుర్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించింది. చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తన వద్ద డబ్బు తీసుకొని ఇవ్వడం లేదంటూ పోలీసులకు (police) ఫిర్యాదు చేసింది స్నేహ. వారి వ్యాపారం నిమిత్తం తన వద్ద 26 లక్షల రూపాయలు (26 lakhs) తీసుకున్నారని స్నేహ ఫిర్యాదులో పేర్కొంది. డబ్బును తిరిగి ఇవ్వమని అడిగితే, డబ్బు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ స్నేహ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
Also Read : ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్.. ఇప్పుడు తెలుగులో..

ఇక తొలివలపు చిత్రంతో టాలీవుడ్ (Tollywood) లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఆ తర్వాత తన చిరకాల స్నేహితులు, నటుడు ప్రసన్నను ప్రేమించి వివాహం చేసుకుంది.

Also Read : బాలకృష్ణ, కొరటాల కాంబోలో మల్టీస్టారర్‌ మూవీ? మరో హీరో మహేశ్‌బాబు అట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News