Adhi Pinishetty Wedding: రచ్చ లేపారుగా.. ఆది-నిక్కీ హల్దీ ఫంక్షన్‌లో నాని, సందీప్ కిషన్ డ్యాన్స్...

Adhi Pinishetty Nikki Galrani Wedding: సెలబ్రిటీ కపుల్ ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ హల్దీ ఫంక్షన్‌లో హీరోలు నాని, సందీప్ కిషన్ సందడి చేశారు. హల్దీ ఫంక్షన్‌లో కొత్త జంటతో కలిసి స్టెప్పులేశారు.

Last Updated : May 18, 2022, 06:43 PM IST
  • ఆది పినిశెట్టి నిక్కీ గల్రానీ వెడ్డింగ్
  • హల్దీ ఫంక్షన్‌లో సందడి చేసిన హీరోలు నాని, సందీప్ కిషన్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
 Adhi Pinishetty Wedding: రచ్చ లేపారుగా.. ఆది-నిక్కీ హల్దీ ఫంక్షన్‌లో నాని, సందీప్ కిషన్ డ్యాన్స్...

Adhi Pinishetty Nikki Galrani Wedding: యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ఇవాళ (మే 18) వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. చెన్నైలో ఈ జంట వివాహం జరగనుంది. పెళ్లికి ముందు జరిగిన మెహందీ, హల్దీ, వేడుకల్లో హీరోలు నాని, సందీప్ కిషన్ సందడి చేశారు. ఆది పినిశెట్టితో కలిసి అజిత్ అప్‌కమింగ్ మూవీలోని ఓ పాటకు నాని, సందీప్ కిషన్ హుషారుగా స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

హల్దీ ఫంక్షన్‌లో ఆది-నిక్కీ ఒకరికొకరు పసుపు రాసుకుంటున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆది పినిశెట్టి కానీ, నిక్కీ గల్రానీ కానీ తమ వెడ్డింగ్ ఫంక్షన్ ఫోటోలను ఇప్పటికైతే బయటపెట్టలేదు. ఎవరో తీసిన వీడియోలు ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. 

కాగా, ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ కలిసి గతంలో 'మారగత నానయం', 'యాగవరయినుమ్ నా కాక్క' అనే రెండు తమిళ సినిమాల్లో నటించారు. అప్పటినుంచే ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది. ఈ క్రమంలో గత మార్చి 27న ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇవాళ చెన్నైలో వీరి పెళ్లి జరగనుంది. అయితే పెళ్లి వేదిక, సమయం తదితర వివరాలేవీ బయటకు రాలేదు. 

ప్రస్తుతం ఆది పినిశెట్టి.. రామ్ హీరోగా తెలుగు, తమిళంలో తెరకెక్కుతోన్న 'ది వారియర్' సినిమాలోనటిస్తున్నాడు. లింగుస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిక్కీ గల్రానీ విషయానికొస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో 'మేరీ ఆవాజ్ సునో' అనే చిత్రంతో పాటు మరో చిత్రంలో నటిస్తోంది. 

Also Read: Warangal Tractor Accident: వరంగల్‌లో ఘోర విషాదం... ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు దర్మరణం...   

Also Read: Rajyasabha Kcr: జగన్ బాటలో కేసీఆర్.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x