The Warrior Teaser: ది వారియర్ టీజర్.. ఈ పోలీసోడు కొట్టి మరీ పెయిన్ కిల్లర్ ఇస్తాడు

The Warrior Teaser: రామ్ పొతినేని అప్‌కమింగ్ సినిమా ది వారియర్ టీజర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. మే 15న రామ్ పుట్టినరోజు కావడంతో అంతకంటే ఒక్క రోజు ముందుగానే ఇవ్వాళ ది వారియర్ టీజర్ విడుదల చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 07:57 PM IST
  • రామ్ పొతినేని అప్‌కమింగ్ సినిమా 'ది వారియర్'
  • మే 15న రామ్ పుట్టిన రోజు కానుకగా నేడు ది వారియర్ టీజర్ విడుదల
  • పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్
The Warrior Teaser: ది వారియర్ టీజర్.. ఈ పోలీసోడు కొట్టి మరీ పెయిన్ కిల్లర్ ఇస్తాడు

The Warrior Teaser: రామ్ పొతినేని అప్‌కమింగ్ సినిమా ది వారియర్ టీజర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. మే 15న రామ్ పుట్టినరోజు కావడంతో అంతకంటే ఒక్క రోజు ముందుగానే ఇవ్వాళ ది వారియర్ టీజర్ విడుదల చేశారు. ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకున్న రామ్ పొతినేని ఆ తర్వాత రెడ్ చిత్రంతో కొంత డిజప్పాయింట్ అయ్యాడు. దీంతో ఈసారి రెట్టింపు కసితో మరోసారి ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ లాంటి హిట్ కొట్టాలనే జోష్‌తో ది వారియర్ మూవీతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. 

ఫేమస్ తమిళ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ పొతినేని ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ది వారియర్ టీజర్ చూస్తే మరోసారి హీరో రామ్‌ని పూర్తి స్థాయి పవర్‌ఫుల్ పాత్రలో చూడొచ్చనిపిస్తోంది అంటున్నారు రామ్ ఫ్యాన్స్. ది వారియర్ మూవీలో సత్య అనే ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో హీరో రామ్ (Ram Pothineni) ఎంట్రీ ఇవ్వనున్నాడు. జూలై 14న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

Also read : Varshini About Srikanth Reddy: కరాటే కళ్యాణి vs శ్రీకాంత్ రెడ్డి వివాదంలో వర్షిణి వెర్షన్ ఏంటి ?

Also read : Janhvi Kapoor Bikini Pics: చేయి అడ్డుపెట్టి.. ఎద అందాలు దాచేసిన జాన్వీ కపూర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News