Adiparvam Trailer Talk: మంచు లక్ష్మి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆది పర్వం'.. అదిరిన ట్రైలర్..

Adiparvam Trailer Talk: మంజు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. నట ప్రపూర్ణ మోహన్ బాబు కూతురిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అడపదడపా  కొన్ని సినిమాలు చేస్తూనే ఉంది. ఈ రూట్లో ఈమె యాక్ట్ చేస్తోన్న మరో మూవీ 'ఆదిపర్వం'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో ఘనంగా జరిగింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 19, 2024, 07:25 PM IST
Adiparvam Trailer Talk: మంచు లక్ష్మి ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆది పర్వం'.. అదిరిన ట్రైలర్..

Adiparvam Trailer Talk: మంజు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. ఈమె లీడ్ రోల్ల్ నటించిన తొలి ప్యాన్ ఇండియా మూవీ. అంతేకాదు ఈ సినిమాను సోషియో ఫాంటసీ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ  ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా 5 భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. తెలంగాణ ఎఫ్.డి.సి (ఫిల్మ్ డెవలప్మెంట్) ఛైర్మన్ ఎన్. గిరిధర్ చేతుల మీదుగా ఆదిపర్వం తెలుగు ట్రైలర్ విడుదలైంది. జడ్చర్ల ఎమ్మెల్యే జె అనిరుధ్ రెడ్డి తమిళ ట్రైలర్, ప్రముఖ దర్శకులు నీలకంఠ కన్నడ ట్రైలర్, ప్రముఖ రియల్టర్ శిల్పా ప్రతాప్ రెడ్డి మలయాళ ట్రైలర్, చిత్ర సమర్పకులు రావుల వెంకటేశ్వర్ రావు హిందీ ట్రైలర్ విడుదల చేశారు.ఆయా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, బిల్డర్ కైపా ప్రతాప్ రెడ్డి, నటీనటులు ఢిల్లీ రాజేశ్వరి, సత్య ప్రకాష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, జెమినీ సురేష్, ఆదిత్య ఓం, శ్రీజిత ఘోష్, సీనియర్ జర్నలిస్టులు ప్రభు, ఆర్.డి.ఎస్ ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ ఎస్.ఎస్. హరీష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఘంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అతిధులంతా సినిమా సక్సెస్ కావాలని ఆకాక్షించారు.

ఈ సందర్భంగా లక్ష్మీ మంచు మాట్లాడుతూ..
ఈ సినిమా కథ తన దగ్గరకు రావడం తన అదృష్టం అన్నారు. నాకు సంజీవ్ స్టోరీ చెప్పినపుడు ఇంత పెద్ద సినిమా తక్కువ టైమ్‌లో ఎలా తీస్తారని అనుకున్నాను. ఈ పోస్టర్ చూస్తుంటే ఇన్ని క్యారెక్టర్స్ చేశానా అని నమ్మకం నాకు కుదరడం లేదు.
ఈ సినిమాలో నవరసాలు, ఎమోషన్స్ అన్ని ఉన్నాయి. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందన్నారు.  మా నిర్మాతలు కోరుకున్న దాని కంటే ఎక్కువ విజయం సాధించాలని కోరకుంటున్నాను.  ఈ కార్యక్రమంలో ఓ అభిమాని మంచు లక్ష్మికి పాదాభివందనం చేసారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు మంచు లక్ష్మిని గజమాలతో సత్కరించారు.

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ...
మంచు లక్ష్మీ సినిమాతో డైరెక్టర్ కాబోతున్నాను. ఆదిపర్వం సినిమా ఈ రకంగా రావడానికి కారణం మంజు లక్ష్మి ప్రోత్సాహమే కారణం అన్నారు. ఈ సినిమాలో  మంచు లక్ష్మీ గారి విశ్వరూపం చూస్తాం. ఆదిత్య ఓం గారిని కొత్త పాత్రలో చూస్తారు. ఎస్తర్ గారు కీలక పాత్ర చేశారు. శ్రీజిత ఘోష్ వద్దని 99 మంది చెబితే నేను ఒక్కడినే ఆ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పా. ఆమె 1000 శాతం న్యాయం చేసింది. శివ కంఠమనేని క్షేత్ర పాలకుడిగా మంచి క్యారెక్టర్  క్యారెక్టర్ చేశారు. లక్ష్మీ మంచు భర్త పాత్రలో జెమిని సురేష్ చక్కని నటన కనబరిచారు. ఈ సినిమాలో సుమారు 400 మంది నటించారు. ఈ సినిమాకు బలం, బలగం మంచు లక్ష్మీనే. దాదాపు ఏడు గెటప్స్ వేశారు. దాదాపు 50 అడుగుల ఎత్తులో ఫైట్స్ చేశారు. ఆవిడ లేకపోతే ఈ మూవీ లేదు. ఈ మూవీకి ఇంత ప్రాముఖ్యం వచ్చేది కాదు. ఇది ఆరంభం మాత్రమే అన్నారు.

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ... ఆదిపర్వం వివిధ భాషలకు చెందిన ట్రైలర్స్ అదిరిపోయాయి. ఈ సినిమా ఈ రేంజ్ లో వస్తుందని నేను ఊహించలేదు. మంచు లక్ష్మి కెరీర్ లో ఈ చిత్రం ఒక మైల్ స్టోన్ అవుతుందన్నారు. ఈ చిత్రంలో నటీనటులు: మంచులక్ష్మీ, శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డంనవీన్, ఢిల్లీరాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వర్ రావు, సాయి రాకేష్, వనితారెడ్డి, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరాల వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ (జాతిరత్నాలు), మృత్యుంజయ శర్మ తదితరులు

టెక్నికల్ విషయానికొస్తే:
సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్
ఆర్ట్ : కేవీ రమణ
మ్యూజిక్ : మాధవ్ సైబా - సంజీవ్ మేగోటి, బి. సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్.
సాహిత్యం : సాగర్ నారాయణ్, రాజాపురం శ్రీనాథ్, వూటుకూరి రంగారావు, మనేకుర్తి మల్లికార్జున, రాజ్ కుమార్ సిరా
ఎడిటర్ : పవన్ శేఖర్ పసుపులేటి ,
ఫైట్స్ : నటరాజ్
కొరియోగ్రఫీ : సన్ రేస్ మాస్టర్  
పబ్లిసిటీ డిజైనర్ : రమణ బ్రష్
పి.ఆర్. ఓ : ధీరజ్ - అప్పాజీ
కో డైరెక్టర్ : అక్షయ్ సిరిమళ్ళ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు
సహనిర్మాతలు: గోరెంట శ్రావణి- ప్రదీప్ కాటుకూటి- రవిదశిక- రవి మొదలవలస- శ్రీరామ్ వేగరాజు.
నిర్మాత : ఎమ్. ఎస్ కె.
రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి

Also Read: TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై

Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News