Adiparvam - Manchu Laskhmi: టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మీ ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించారు దర్శకుడు సంజీవ్ మేగోటి. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్-ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు సహా కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా ఈసినిమాను తెరకెక్కించినట్టు చెప్పారు.రీసెంట్‌గా ఐదు భాషల్లో విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తోంది.
ఈ సందర్భంగా చిత్ర డైరెక్టర్ సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ... "ఆదిపర్వం" ప్రచార చిత్రానికి అన్ని భాషల్లో మంచి స్పందన వ్యక్తం అవుతోంది. ఈ సినిమా కోసం మేము పడిన కఠోర శ్రమ ఈ రెస్పాన్స్ చూసి మర్చిపోయేలా చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. త్వరలో సెన్సార్ జరగనుంది.బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మిగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
ఆదిపర్వం చిత్రంలో మంచులక్ష్మీ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో శివకంఠంనేని , ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, సుహాసిని, హ్యారీజోష్, సమ్మెట గాంధీ, యోగికాత్రి, గడ్డం నవీన్, ఢిల్లీ రాజేశ్వరి, జెమినీ సురేష్, బీఎన్ శర్మ, శ్రావణి, జ్యోతి, అయేషా, రావుల వెంకటేశ్వరరావు, సాయి రాకేష్, వనితారెడ్డి,వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, గూడా రామకృష్ణ, రవిరెడ్డి, దేవిశ్రీ ప్రభు, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, రాధాకృష్ణ, స్నేహ, లీలావతి, శ్రీరామ్ రమేష్, శిల్పప్రతాప్ రెడ్డి, చిల్లూరి రామకృష్ణ, జోగిపేట ప్రేమ్ కుమార్ , మృత్యుంజయ శర్మ తదితరులు నటించారు.
ఈ సినిమా టెక్నిషియన్స్ విషయానికొస్తే..
సమర్పణ: రావుల వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీష్
ఆర్ట్ : కేవీ రమణ
సంగీతం : మాధవ్ సైబా - సంజీవ్ మేగోటి, బి.సుల్తాన్ వలి, ఓపెన్ బనానా, లుబెక్ లీ మార్విన్.
సాహిత్యం: సాగర్ నారాయణ్, రాజాపురం శ్రీనాథ్, ఊటుకూరు రంగారావు, మనేకుర్తి మల్లికార్జున, రాజ్ కుమార్ సిరా
ఎడిటర్: పవన్ శేఖర్ పసుపులేటి,
ఫైట్స్: నటరాజ్
కొరియోగ్రఫీ : సన్ రేస్ మాస్టర్
పబ్లిసిటీ డిజైనర్ : రమణ బ్రష్
పీఆర్‌ఓ: ధీరజ్ - అప్పాజీ
కో డైరెక్టర్: అక్షయ్ సిరిమళ్ళ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:
ఘంటా శ్రీనివాసరావు
సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి- ప్రదీప్ కాటుకూటి- రవి దశిక- రవి మొదలవలస -
శ్రీరామ్ వేగరాజు.
నిర్మాత : ఎమ్.ఎస్.కె.
రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి.
Also Read: KTR Challenge: దమ్ముంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: కేటీఆర్ సంచలన సవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook