మంత్రి తలసానికి 'అజ్ఞాతవాసి' ఆహ్వానం !

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి అతజ్ఞాతవాసి నుంచి ఆహ్వానం అందింది.

Last Updated : Jan 6, 2018, 06:42 PM IST
మంత్రి తలసానికి 'అజ్ఞాతవాసి' ఆహ్వానం !

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి అతజ్ఞాతవాసి నుంచి ఆహ్వానం అందింది. ఈరోజు మంత్రి తలసానిని కలిసిన అజ్ఞాతవాసి సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ.. ఈ నెల 10వ తేదీన విడుదల కానున్న తమ సినిమాని చూసేందుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అజ్ఞాతవాసి టీమ్ నుంచి అందిన ఆహ్వానం మేరకు ఆ సినిమా ప్రీమియర్స్ కి హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ ఫీమేల్ లీడింగ్ రోల్స్ పోషిస్తున్నారు. పవిత్ర రిష్తా ఫేమ్ పరాగ్ త్యాగి విలన్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, సంపత్ రాజ్, బొమన్ ఇరాని, ఖుష్బూ లాంటి స్టార్స్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కాటమరాయుడు తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఇది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులని ఏ మేరకు ఎంటర్ టైన్ చేయనుందో తెలియాలంటే, జనవరి 10వ తేదీ వరకు వేచిచూడాల్సిందే. 

Trending News