Aha Video Team Concentrated on Korean Content: ప్రపంచమంతా కరోనా దెబ్బకు వణికి పోతుంటే అల్లు అరవింద్ మాత్రం అనూహ్యంగా ఆహా వీడియో అనే ఒక ఓటిటి యాప్ ను లాంచ్ చేశారు. వాస్తవానికి ఇందులో ఆయన వర్కింగ్ పార్ట్నర్ అయిన ప్రస్తుతం తెలుగులో ఒక లీడింగ్ న్యూస్ ఛానల్ ని నడుపుతూ మై హోమ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతున్న మై హోమ్ గ్రూప్ దీన్ని మేనేజ్ చేస్తోంది.
ఆ సంగతి అలా ఉంచితే మొట్టమొదటి తెలుగు ఓటిటి అని చెప్పడమే కాక ప్యూర్ తెలుగు కంటెంట్ మాత్రమే అందిస్తామని చెప్పడంతో ఈ ఓటిటి మీద అందరూ ఆసక్తి చూపించారు. అయితే తరువాత తెలుగు కంటెంట్కు కరువు ఏర్పడడంతో ఇతర భాషల సినిమాలను కూడా డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే ఎక్కువగా ఆ మధ్య మలయాళ సినిమాలను కొని తెలుగులో డబ్బింగ్ చేసి ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తూ వచ్చారు.
అయితే తమిళ ఇతర భాషల సినిమాల జోలికి మాత్రం వెళ్ళలేదు, అయితే ఇప్పుడు మలయాళం సినిమాల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారో తెలియదు. కానీ కొరియన్ సినిమాల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొరియా వెబ్ సిరీస్ లు సినిమాల మీద యూత్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా కొరియన్ వెబ్ సిరీస్ లకు సీరియల్స్ కి కూడా ఫిదా అయిపోతూ ఎక్కువగా కొరియన్ కంటెంట్ చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇదే విషయాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆహా వీడియో ఇప్పుడు కొరియన్ వెబ్ సిరీస్ లను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ‘’ఫైట్ ఫర్ మై వే’’ అనే ఒక వెబ్ సిరీస్ డబ్బింగ్ ఇప్పటికే పూర్తికాగా డిసెంబర్ 24వ తేదీ నుంచి దాన్ని తెలుగులో ప్రీమియర్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఇదే బాటలో మౌస్ అనే మరో వెబ్ సిరీస్ కూడా డబ్బింగ్ చేస్తున్నారని ఆ తర్వాత మరిన్ని వెబ్ సిరీస్ లను కూడా తెలుగులో డబ్బింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కొరియన్ వెబ్ సిరీస్ లకి వచ్చే ఆదరణ చూసి తర్వాత సినిమాలు కూడా డబ్బింగ్ చేయాలా లేదా అనే విషయం మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆహా వీడియో యాజమాన్యం ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక స్పెషలిస్ట్ టీంని కూడా పెట్టుకుని అన్ని దగ్గరుండి పరిశీలింపచేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంమీద కొరియన్ వెబ్ సిరీస్ లకు తెలుగు నాట ఎలాంటి క్రేజ్ లభిస్తుంది అనేది చూడాల్సి ఉంది.
Read More: Bandla Ganesh Tweet: బండ్లను మోసం చేసిందెవరు? పవన్ పేరు ఎందుకొస్తోంది?
Read More: Venkatesh Next Movie: హిట్ డైరెక్టర్ కథకు వెంకీ మామ గ్రీన్ సిగ్నల్.. కానీ అంతా కన్ఫ్యూజన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.