7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!

7th Pay Commission DA Hike 2024: మోదీ ప్రభుత్వం నుంచి శుభవార్త కోసం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు డియర్‌నెస్ అలవెన్స్ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న విషయం తెలిసిందే. AICPI ఇండెక్స్ సెమీ-వార్షిక డేటాపై ఆధారంగా డీఏలో పెంపుదల ఉంటుంది. ఈ ఏడాది రెండో డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.
 

  • Jun 28, 2024, 13:38 PM IST
1 /7

ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెరిగింది. జనవరి 1వ తేదీ నుంచి కేంద్రం అమలు చేసింది. జనవరి నుంచి జూన్ వరకు అర్ధ-వార్షిక AICPI ఇండెక్స్ డేటా ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నాలుగు శాతం డీఏ పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.   

2 /7

ప్రస్తుతం డీఏ 50 శాతం ఉంది. మరోసారి 4 శాతం పెంచితే మొత్తం 54 శాతానికి చేరుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

3 /7

జనవరిలో AICPI సూచీ 138.9 పాయింట్ల వద్ద ఉంది. ఫిబ్రవరిలో 139.2, మార్చిలో 138.9, ఏప్రిల్‌లో 139.4 పాయింట్లుగా ఉంది. దీంతో డీఏ 52.43 శాతానికి చేరుకోవడంతో జూలైలో 4 శాతం పెరుగుదలను ఉంటుందని అంచనా వేస్తున్నారు.  

4 /7

మే, జూన్‌ నెలలకు సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేస్తే.. డీఏ పెంపు క్లారిటీ వస్తుంది. జూన్‌లో సూచీ 0.5 పాయింట్లు పెరిగినా.. 52.91 శాతానికి చేరుకుంటుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో డీఏ పెంపుపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  

5 /7

జూలై నెలలో 4 శాతం డీఏ పెరిగితే.. మొత్తం డీఏ 54 శాతానికి చేరుకుంటుంది. ఉదాహరణకు ఉద్యోగి బేసిక్ శాలరీ రూ.50 వేలు అయితే.. డీఏ 4 శాతం అంటే రూ.2 వేలు పెరుగుతుంది. అంటే జూలై జీతంలో రూ.2 వేల పెంపు ఉంటుంది. ఉద్యోగి బేసిక్ శాలరీ 18 వేలు అయితే.. నెలకు రూ.720 పెరుగుతుంది.   

6 /7

మూలవేతనం రూ.52 వేలు ఉంటే.. ప్రతి నెలా రూ.2080 చొప్పున ఏడాదికి రూ.28,080 జీతం పెరుగుతుంది. రూ.లక్ష బేసిక్ పే ఉంటే.. ప్రతి నెలా రూ.4 వేల చొప్పున సంవత్సరానికి రూ.54 వేల జీతం పెరుగుతుంది. బేసిక్ రూ.60 వేలు ఉంటే.. నెలకు రూ.2,400 పెంపు, రూ.70 వేల ప్రాథమిక వేతనం ఉంటే.. రూ.2,800 పెంపు ఉంటుంది.  

7 /7

గమనిక: ఈ సమాచారం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే అందజేసినది. వేతన రేటు పెంపుదలకు లేదా తదుపరి వేతన కమిషన్‌కు ఏర్పాటుపై అధికారిక సమాచారం కాదు. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సందర్శించండి.