Allu Arjun Coca Cola Ad: కొరియన్ గర్ల్స్ తో కలిసి కోకాకోలా యాడ్ లో ఇరగదీసిన బన్నీ..!

Allu Arjun: అల్లు అర్జున్ మరో యాడ్ తో మన ముందుకొచ్చారు. ఫేమస్ కూల్ డ్రింక్ బ్రాండ్ కోకా కోలా యాడ్ లో నటించి ఇరగదీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2022, 12:27 PM IST
Allu Arjun Coca Cola Ad: కొరియన్ గర్ల్స్ తో కలిసి కోకాకోలా యాడ్ లో ఇరగదీసిన బన్నీ..!

Allu Arjun Coca Cola Ad :  పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించాడు. తన డైలాగ్స్, డ్యాన్స్, యాక్టింగ్ తో యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో  వరుస యాడ్స్ దుమ్ములేపుతున్నాడు బన్నీ. తాజాగా మరో యాడ్ తో మందుకొచ్చాడు స్టైలీస్ స్టార్. పాపులర్ కూల్ డ్రింక్ కంపెనీ కోకా కోలా యాడ్ (Coca Cola Ad)లో నటించి అదరగొట్టాడు. అయితే ఈ యాడ్ ని ఓ సాంగ్ రూపంలో తీసుకొచ్చారు యాడ్ నిర్వాహకులు. ఇది సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది. ఈ సాంగ్ చూసిన బన్నీ ఫ్యాన్స్ యమ ఖుషీగా ఉన్నారు. 

ఈ యాడ్ సాంగ్ ని బుట్ట బొమ్మ సింగర్ అర్మాన్ మాలిక్ (Armaan malik)తో పాడించారు. ఈ యాడ్ లో అర్మాన్ అల్లు అర్జున్ తో కలిసి నటించాడు. అంతేకాకుండా ఫేమస్ కొరియన్ మోడల్, యాక్టర్ ట్రిబె కూడా బన్నీతో కలిసి స్టెప్పులు వేశారు.  'మేము ఆగము...' అంటూ సాగే ఈ కోకా కోలా యాడ్ సాంగ్ ను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్ లో రూపొందించారు. ఈ పాటలో అల్లు అర్జున్ తన మార్క్ స్టెప్పులతో అలరించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బన్నీ కోకా కోలా యాడ్ చేయడంతో అతని క్రేజ్ విదేశాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News