Allu Arjun: అల్లు అర్జున్‌కు మ‌రో అరుదైన గౌర‌వం.. భార‌త దేశం తరుపున ఐకాన్ స్టార్ ఒకే ఒక్క‌డు..

Allu Arjun: అల్లు అర్జున్‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. మ‌న దేశం త‌రుపున విదేశాల్లో జ‌రుగుతున్న ఓ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు మ‌న దేశం త‌రుపున బాధ్య‌త వ‌హించే బాధ్య‌త ఈ ఐకాన్ స్టార్‌కు ద‌క్కింది.

Last Updated : Feb 16, 2024, 10:49 AM IST
Allu Arjun: అల్లు అర్జున్‌కు మ‌రో అరుదైన గౌర‌వం.. భార‌త దేశం తరుపున ఐకాన్ స్టార్ ఒకే ఒక్క‌డు..

Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. 2021 యేడాది గాను పుష్ప పార్ట్ 1 సినిమాలోని నటనకు గాను జాతీయ అవార్డు అందుకున్నాడు. తెలుగు నుంచి ఈ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న ఫస్ట్ హీరోగా రికార్డులకు ఎక్కాడు. తాజాగా ఐకాన్ స్టార్ ఖాతాలో మరో గౌరవం వచ్చి చేరింది.

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మన దేశపు తరుపున ప్రాతినిధ్యం వహించే అవకాశం బన్నికి దక్కింది. ఈ సందర్భంగా బెర్లిన్‌లో జరగనున్న 74వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు జర్మనీ బయలు దేరి వెళ్లారు. పుష్ప
సినిమాలోని నటకు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు అల్లు అర్జున్.

ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జరగుతోంది. ఈ యేడాది ఆగష్టు 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొదటి పార్ట్ తెలుగులో కంటే హిందీలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ బజ్ ఉంది. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్.. పుష్ప కంటే అద్భుతమైన సంగీతం అందించనున్నారట. పుష్ప మాదిరే పుష్ప 2 రూల్ మూవీలోని పాటలు కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచే అవకాశాలున్నాయి. ఇక సుకుమార్ మూవీ తర్వాత అల్లు అర్జున్.. వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం.

Read More: Vijay Devarakonda - Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ సింగిల్‌కు సూపర్ రెస్పాన్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News