Pushpa Keshava: మహిళ ఆత్మహత్య…పుష్ప సినిమా నటుడు జగదీష్ అరెస్ట్

Pushpa: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ కి ఎంత పేరు వచ్చిందో పక్కన ఆయన ఫ్రెండ్ గా నటించినా కేశవ క్యారెక్టర్ కి కూడా అంతే పేరు వచ్చింది. కాగా ఇప్పుడు ఈ కేశవ క్యారెక్టర్ లో నటించిన జగదీష్ ఒక మహిళ  ఆత్మహత్య కేసులో ఇప్పుడు అరెస్ట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేస్తోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2023, 07:24 PM IST
Pushpa Keshava: మహిళ ఆత్మహత్య…పుష్ప సినిమా నటుడు జగదీష్ అరెస్ట్

Jagadeesh Arrest :సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ గా నిలిచి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా సంపాదించి పెట్టింది. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ కి ఎంత పేరు వచ్చిందో ఆయన పక్కన ఉండే కేశవ క్యారెక్టర్ కి కూడా అంత గుర్తింపు వచ్చింది. పక్కా చిత్తూరు యాసలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు కేశవ క్యారెక్టర్ లో నటించిన జగదీష్.

 దీంతో జ‌గ‌దీశ్ వ‌రుస సినిమాలతో మంచి బిజీగా ఉన్నాడు. అంతేకాదు పుష్ప రెండవ భాగంలో కూడా జగదీష్ కి సుకుమార్ చాలా కీలకమైన పాత్రే ఇచ్చారు అని మొన్నటి వరకు వార్తలు చక్కర్లు కొత్తయి. ఈ నేపథ్యంలో అతని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్మ కేసులో అత‌డిని అరెస్టు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే పంజాగుట్ట ప‌రిధిలో ఓ మ‌హిళ నివాసం ఉంటోంది. కాగా సినిమాలలో జూనియర్ ఆర్టిస్టుగా చేసే ఆమె.. గ‌త నెల 29న ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఇక దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ద‌ర్యాప్తులో పంజాగుట్ట పోలీసులు ఆ మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి గ‌ల‌ కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఆమె ఓ వ్య‌క్తితో ఉన్న స‌మ‌యంలో జ‌గ‌దీశ్ ఆమెకు తెలియ‌కుండా ఫోటోలు తీశాడు. ఇక ఆ ఫోటోలను చూపించి ఆమెని బెదిరించేవాడని... దీంతో ఆ మ‌హిళ మ‌న‌స్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని తేలింది.

ఇక దీంతో జ‌గ‌దీశ్‌ను పంజాగుట్ట పోలీసులు బుధ‌వారం అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు. కాగా.. ఆ మ‌హిళకు జ‌గ‌దీశ్‌కు గ‌తంలో ప‌రిచ‌యం ఉన్న‌ట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసు గురించి మరిన్ని కీలక విషయాలు తెలియాల్సి ఉంది.

Also read: Telangana CM Oath: రేపు రేవంత్ కాకుండా మరో ఆరుగురికే ఛాన్స్, , అసెంబ్లీ తరువాతే పూర్తి స్థాయి కేబినెట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News