Amazon Smart Tv: త్వరలో అలెక్సాతో పనిచేసే అమెజాన్ స్మార్ట్ టీవి, ప్రత్యేకతలేంటో తెలుసా

Amazon Smart Tv: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్తగా టీవీ మార్కెట్‌లో ప్రవేశిస్తోంది. కొత్తగా స్మార్ట్ టీవీని మార్కెట్‌లో విడుదల చేయనుంది. అమెజాన్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలేంటి, ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2021, 04:25 PM IST
Amazon Smart Tv: త్వరలో అలెక్సాతో పనిచేసే అమెజాన్ స్మార్ట్ టీవి, ప్రత్యేకతలేంటో తెలుసా

Amazon Smart Tv: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్తగా టీవీ మార్కెట్‌లో ప్రవేశిస్తోంది. కొత్తగా స్మార్ట్ టీవీని మార్కెట్‌లో విడుదల చేయనుంది. అమెజాన్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలేంటి, ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం.

ఆన్‌లైన్ వాణిజ్య దిగ్గజం అమెజాన్ ( Amazon)సంస్థ కొత్తగా అమెజాన్ బ్రాండెడ్ టీవీ మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. బ్రాండ్ ఫైర్ టీవీ అంటే మల్టిపుల్ మోడల్ తరహాలో 55 నుంచి 75 అంగుళాల టీవీని అక్టోబర్ నెలలో అందుబాటులో తీసుకురానుంది. అమెజాన్ సంస్థకు చెందిన వర్చువల్ అసిస్టెంట్ డివైజ్ అలెక్సా ( Alexa)కమాండ్ కంట్రోల్‌తో పనిచేసేలా ఈ కొత్త స్మార్ట్ టీవీని అభివృద్ధి చేస్తోంది. దీనికోసం చైనా ఎలక్ట్రానిక్ కంపెనీ టీసీఎల్ టెక్నాలజీతో చేతులు కలిపింది. అమెజాన్ - టీసీఎల్ ( Amazon-TCL)భాగస్వామ్యంతో తయారవుతున్న ఈ టీవీలో అడాస్టివ్ వాల్యూమ్ ఫీచర్ ఉంటుంది. డిష్ వాషర్ సౌండ్, వ్యక్తుల మధ్య సంభాషణలు, మరోచోట ప్లే అవుతున్న మ్యూజిక్‌ను అలెక్సా గుర్తించి..తదనుగుణంగా స్పందిస్తుంది. ఇదే కాకుండా అమెజాన్ బేసిక్ బ్రాండ్ టీవీల్ని ఇండియన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. అమెజాన్ ఫైర్‌స్టిక్ టీవీ ( Amazon Firestick Tv)సాఫ్ట్‌వేర్ ఆధారితమైన తోషిబా, ఇన్ సిగ్నియా టీవీలను విక్రయించబోతోంది.

అమెజాన్ సంస్థకు ఇప్పటి వరకూ సొంతంగా సాఫ్ట్‌వేర్ లేదు. ఇంతవరకూ ఆ సంస్థ వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ అందించిన సాఫ్ట్‌వేర్ , ఇతర ఎక్విప్‌మెంట్‌లతో తయారు చేసిన టీవీలను మార్కెట్‌లో విడుదల చేసింది. అయితే గత కొద్దికాలంగా అమెజాన్ సంస్థ సొంతంగా తయారు చేసిన సాఫ్ట్‌వేర్ ఆధారిత టీవీల్ని మార్కెట్‌లో విడుదల చేయాలని భావిస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే..అమెజాన్ బ్రాండ్ టీవీ ( Amazon Brand Tv)రానుంది. ముందుగా అంటే అక్టోబర్ నెలలో అమెరికాలోనూ, తరువాత ఇండియాలోనూ అమెజాన్ సొంత టీవీ విడుదల కానుంది.

Also read: Google History: గూగుల్ సెర్చ్‌లో తొలిసారిగా వెతికిన ఆ పదమేంటి, గూగుల్ ఎలా పుట్టింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News