OTT Craze: ఓవర్ ది టాప్. కరోనా నేపధ్యంలో వినియోగం బాగా పెరిగిన వేదిక. సగటు ప్రేక్షకుడికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు ఓటీటీనే. అందుకే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వినియోగదారులకు గుడ్‌న్యూస్ అందిస్తోంది.
అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, సోనీ లివ్, ఆహా ఇలా చాలా ఓటీటీ వేదికలు అందుబాటులో ఉన్నాయి. కరోనా సంక్రమణ, లాక్‌డౌన్ నేపధ్యంలో వీటి వినియోగం బాగా పెరిగింది. థియేటర్లకు ప్రత్యామ్నాయంగా మారాయి. అన్ని సినిమాలు ఓటీటీల్లోనే విడుదలయ్యేవి. ఇప్పుడు కూడా థియేటర్లలో విడుదలైన కొద్దిరోజులకు ఏదో ఒక ఓటీటీలో పెద్ద సినిమాలు విడుదలవ్వాల్సిన పరిస్థితి. అంటే ప్రేక్షకులు ఓటీటీలకు అంతగా అలవాటయ్యారు. ఓటీటీ వీక్షకులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారు.
దీనికి తగ్గట్టు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఓటీటీలు వెబ్‌సిరీస్ అస్త్రాల్ని ప్రయోగిస్తున్నాయి. సినిమా కంటే భారీగా ఉంటూ అత్యంత ఆసక్తికరంగా ఉంటున్నాయి. సినిమాల కంటే వెబ్‌సిరీస్‌లతోనే ఎక్కువ మంది వీక్షకుల్ని ఆకట్టుకోగలుగుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్కైబర్లకు శుభవార్త విన్పించింది.
త్వరలో అంటే రానున్న రెండేళ్లలో అమెజాన్ ప్రైమ్ దాదాపు 40 వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందించనున్నామని వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వీటిని నిర్మించనున్నట్టు ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థలు కరణ్ జోహార్ ధర్మ ఎంటర్‌టైన్‌మెంట్, ఎక్సెల్ మీడియా, ఎమ్మీ ఎంటర్‌ప్రైజెస్, రాజ్ అండ్ డీకే ఫిల్మ్స్‌లతో కలిసి 22 ఒరిజినల్ స్క్రిప్టెడ్ సిరీస్, 9 రిటర్నింగ్ సిరీస్, 3 అమెజాన్ సినిమాలు, 2 కో ప్రొడక్షన్స్ నిర్మించనుంది. నాగచైతన్య హీరోగా వెబ్‌సిరీస్, ఆది పినిశెట్టి, నిత్యా మీనన్, రీతు వర్మ, సుహాసినిలతో మరో వెబ్‌సిరీస్, అమ్ము అనే సినిమాలు త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవి కాకుండా మీర్జాపూర్ 3 , ఫ్యామిలీ మ్యాన్ 3, ముంబై డైరీస్ 2, పాతాల్‌లోక్ 2 కూడా రానున్నాయి. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో ట్రాన్సక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ పేరుతో సినిమాలను అద్దె ప్రాతిపదికన తీసుకొస్తోంది. అంటే టీవీఓడీ పేరుతో ప్రైమ్ మెంబర్స్ కానివారు ఈ సేవలు పొందవచ్చు. జీ5..జీఫ్లెక్స్ పేరుతో అందుబాటులో తీసుకొచ్చింది.
Also read: Acharya Movie Trolls: ఆచార్య మూవీపై ట్విట్టర్ లో ఘోరమైన ట్రోలింగ్.. అసలు ఏమైంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook