Avatar 2 Collections : కలెక్షన్లలో దుమ్ములేపుతోన్న అవతార్ 2.. ఆల్ టైం టాప్ 5 చిత్రాల్లోకి చేరిన విజువల్ వండర్

Avatar 2 Total Collections in India  అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా మెల్లిమెల్లిగా రికార్డులను చెరిపేస్తోంది. అవతార్ 2  చిత్రం ఇప్పుడు ఇండియాలో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. హాలీవుడ్ మూవీస్ ఇండియాలో కోట్లు కొల్లగొడుతుంటాయి. ఆ లిస్ట్‌లో అవతార్‌ 2 ఐదో స్థానంలోకి వచ్చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2022, 05:35 PM IST
  • భారత్‌లో జేమ్స్ కామెరూన్ అవతార్ 2 సందడి
  • టాప్ 5 సినిమాల్లోకి చేరిన అవతార్ 2 చిత్రం
  • రెండు వందల కోట్లు రాబట్టేసిన విజువల్ వండర్
Avatar 2 Collections : కలెక్షన్లలో దుమ్ములేపుతోన్న అవతార్ 2.. ఆల్ టైం టాప్ 5 చిత్రాల్లోకి చేరిన విజువల్ వండర్

Avatar 2 Day 8 Collections అవతార్ 2 సినిమాకు రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. పోటీలో ఇండియన్ సినిమాలు వచ్చినా కూడా అవతార్ 2 మాత్రం కలెక్షన్లు కొల్లగొడుతూనే ఉంది. హిందీలో సర్కస్ సినిమా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. కానీ అవతార్ 2 దెబ్బకు సర్కస్ ఢీలా పడింది. ఇక తెలుగులోనూ ధమాకా, 18 పేజీస్ అనే సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలకు మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ అవతార్ 2 ప్రభావం మాత్రం గట్టిగానే కనిపిస్తోంది.

అలా అవతార్ 2 సినిమా ఈ రెండో వారంలోనూ దుమ్ములేపుతోంది. ఇప్పటికీ అవతార్ 2 సినిమా థియేటర్లో హౌస్ ఫుల్‌తో సందడి చేస్తుంది. ప్రతీ భాషలో బాగానే ఆడుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టేస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 60 కోట్ల గ్రాస్, 30 కోట్ల నెట్ వచ్చినట్టు సమాచారం అందుతోంది. అయితే ఇదే క్రమంలో ఇండియా మొత్తంగా చూసుకుంటే.. దాదాపు రెండు వందల కోట్లు కొల్లగొట్టేసినట్టు తెలుస్తోంది.

ఇండియాలో హాలీవుడ్ మూవీస్ వందల కోట్లు కొల్లగొడుతుంటాయి. ఈ లిస్ట్‌లో ఇప్పటి వరకు అవెంజర్ ఎండ్ గేమ్ (437 కోట్లు) టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తరువాత ఇన్‌ఫినిటీ వార్‌ (290 కోట్లు), స్పైడర్ మెన్ నో వే హోమ్ (255 కోట్లు) కొల్లగొట్టి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు 249 కోట్లతో అవతార్ 2 సినిమా నాలుగో స్థానంలోకి వచ్చింది. ఇక మున్ముందు అవెంజర్ ఎండ్ గేమ్ రికార్డులను బద్దలు కొడుతుందా? లేదా? అన్నది చూడాలి. అవెంజర్స్, స్పైడర్ మెన్ సినిమాల రికార్డులను మాత్రం అవలీలగా బద్దలు కొట్టేలానే కనిపిస్తోంది.

Also Read : Allu Arjun Wife : కొత్త ఏడాదికి అల్లు స్నేహా రెడ్డి షాకింగ్ నిర్ణయం.. బన్నీకి ఇక కష్టమేనా?

Also Read : Alia Bhatt Fitness : తలకిందులుగా వేలాడుతోన్న అలియా భట్.. మళ్లీ పని మొదలెట్టేసినట్టుందిగా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News