Bandla Ganesh Says Good Bye to Politics: నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత కమెడియన్ గా మారిన బండ్ల గణేష్ ఆ తర్వాత కాలంలో నిర్మాతగా మారి పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. అయితే ఆయన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక వివాదాస్పద విషయాల మీద స్పందిస్తూ ఉంటారు. దీంతో ఆయన ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతుంటారు.
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో ఉన్న బండ్ల గణేష్ తన ఇంట్లోకి దీపావళి సామాన్లు కూడా నాలుగు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే నిజానికి బండ్ల గణేష్ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి చాలా యాక్టివ్ గా పని చేశారు. ఆయన షాద్నగర్ నుంచి టికెట్ కూడా ఆశించారు కానీ అది అయితే దక్కలేదు, అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానంటూ చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.
అయితే ఆ తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆయన ప్రకటించారు. అయితే అడపా దడపా కొన్ని పార్టీలను సపోర్ట్ చేస్తూ వారికి సంబంధించిన కొన్ని పార్టీలను అపోజ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా తను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అంటూ ప్రకటించారు. ‘’నమస్కారం నా కుటుంబ బాధ్యతలు వల్ల నా ఉమ్మడి కుటుంబ సభ్యుల నేపథ్యంలో వారి కోరికపై మా పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నాకున్న పనుల వల్ల, వ్యాపారాల వల్ల నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
నాకు ఏ రాజకీయ పార్టీతో శత్రుత్వం కానీ మితృత్వం కానీ లేదు, అందరూ నాకు ఆత్మీయులే, అందరూ నాకు సమానులే ఇంతకు ముందు నావల్ల ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడి ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమిస్తారని ఆశిస్తున్నాను అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముమ్మరంగా సాగుతున్న సమయంలో బండ్ల గణేష్ ఇలా రాజకీయాలకు గుడ్ బై చెప్పిన క్రమంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Music Director Passes Away: సినీ పరిశ్రమలో విషాదం.. జాండీస్ దెబ్బకు మ్యూజిక్ డైరెక్టర్ మృతి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook