Kalasa Teaser: భానుశ్రీ, అనురాగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. కాగా ఈ సినిమా త్వరలోనే విడుదలకి సిద్ధంగా ఉండటంతో…ఈ సినిమా మేకర్స్ ఈరోజు గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ ని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిపారు.
ఇక ఈ సినిమా తీసెట్ ని పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ చంద్ర విడుదల చెయ్యగా.. బ్యానర్ లోగోను ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, టైటిల్ లోగోను యాట సత్యన్నారాయణ, మోషన్‌పోస్టర్‌ను వీరశంకర్‌లు లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ…ఈ చిత్రం నిర్మాతలకు తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం నిర్మాతలు అర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని..మంచి టెక్నీషియన్స్‌ను ఇచ్చారని తెలియజేశారు. ఇక ఈ చిత్రం టైటిల్ గురించి చెబుతూ ‘కలశ అనే టైటిల్ ఈ సినిమాలోని క్యారెక్టర్. కలశం ఎంత పవిత్రంగా ఉంటుందో.. ఈ క్యారెక్టర్ కూడా అంతే పవిత్రంగా ఉంటుంది. బ్రెయిన్‌కి, హార్ట్‌కి లింక్ చేస్తూ రాసుకున్న సినిమా ఇది. తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుంది’ అని తెలియజేశాడు.
ఆ తరువాత నిర్మాత రాజేశ్వరి చంద్రజ మాట్లాడుతూ...
‘మా తొలి చిత్రం తొలి ప్రమోషన్‌లో తెలుగులోనే ఎంతో పేరు తెచ్చుకున్న నలుగురు దర్శకులు పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలానే నా చిత్ర దర్శకుడు రాంబాబు గారు కూడా చాలా హార్డ్ వర్కర్. ఆయన చెప్పిన కథ నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ సినిమాకు టెక్నీషియన్స్, ఆర్టిస్ట్‌లు అందరూ చక్కగా కో`ఆపరేట్ చేశారు. రాంబాబు గారికి పూర్తి ఫ్రీడం ఇస్తూనే.. ఎక్కడా అశ్లీలత లేకుండా చూడండి అని రిక్వెస్ట్ చేశాను. సెన్సార్ వారు కూడా ఈ సినిమాలో ఎటువంటి కత్తిరింపులు చెప్పలేదు. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అన్నారు.
ఆ తరువాత ఈ సినిమా సంగీత దర్శకుడు విజయ్ కూరాకుల మాట్లాడుతూ.. డైరెక్టర్ రగారు ఈ సినిమా విషయంలో చాలా డీప్‌గా ఇన్వ్‌వాల్వ్ అయ్యారు. ముఖ్యంగా సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ల విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు అందుకే పాటలు చాలా బాగా వచ్చాయి అని తెలియజేశారు.
దర్శకులు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ...
దర్శక, నిర్మాతలు ఈ సినిమా విషయంలో చాలా రీసెర్చ్ అండ్ నాలెడ్జ్‌తో ముందుకు వెళ్లినట్టు ఈ సినిమా టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. లక్ష్మీదేవికి సంబంధించిన కలశం అనే పేరు పెట్టుకున్న ఈ సినిమాలోని లక్ష్మీకటాక్షం పొందుతుందని ఆశిస్తున్నా.. అని తెలియజేశారు.
భీమ్లా నాయక్ దర్శకులు సాగర్ చంద్ర మాట్లాడుతూ...
ఈ సినిమా టీజర్ చాలా బాగుంది. వీరశంకర్ గారు ఈ సినిమా ఆల్రెడీ చూశారు. ఆయన ఈ చిత్రం చాలా బాగుంది అని చెప్పారు. ఆయన చెప్పారు అంటే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది.. అని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఈ డైరెక్టర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook