Lala Bheemla Song DJ: లాలా భీమ్లా డీజే సాంగ్ వచ్చేసింది.. న్యూఇయర్ నైట్ ఇక రచ్చరచ్చే!

Lala Bheemla Song DJ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మాస్ సాంగ్ వచ్చేసింది. 'భీమ్లా నాయక్' సినిమాలోని 'లా లా భీమ్లా..' డీజే వర్షన్ ను న్యూఇయర్ 2022 సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 07:02 PM IST
Lala Bheemla Song DJ: లాలా భీమ్లా డీజే సాంగ్ వచ్చేసింది.. న్యూఇయర్ నైట్ ఇక రచ్చరచ్చే!

Lala Bheemla Song DJ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. సాగర్ కే.చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ లభిస్తోంది. 

ఎస్ఎస్ తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలకు విశేషాదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని 'లాలా భీమ్లా' పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే యూట్యూబ్ లో దూసుకెళ్తున్న ఈ సాంగ్ కు.. 36 మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. 

ఈ నేపథ్యంలో ఇదే సాంగ్ కు సంబంధించిన డీజే వర్షెన్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఫ్యాన్స్ కోరిక మేరకు న్యూఇయర్ సందర్భంగా ఈ డీజే పాటను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించింది. 

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్​, పోలీస్​ అధికారిగా నటించారు. అతడిని ఢీ కొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు. నిత్యమేనన్, సంయుక్త.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. 

Also Read: Acharya Movie Update: మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'ఆచార్య' నుంచి మరో సాంగ్ రిలీజ్!

Also Read: Vishwak Sen Corona: హీరో విశ్వక్ సేన్ కు కరోనా పాజిటివ్.. వ్యాక్సిన్ తీసుకున్నా సోకిన వైరస్! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News