Big Breaking: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..! చంచల్‌గూడ జైలుకు తరలింపు..

Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ విషయం ఘటనలో అల్లు అర్జున్ బిగ్ షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ నాంపల్లి హైకోర్టు తీర్పునిచ్చింది.డిసెంబర్ 5న పుష్ప2 సినిమా విడుదల అయింది. అంతకుముందు రాత్రి 9:30 కు సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో నిర్వహించారు... దీనికి పెద్ద మొత్తంలో అభిమానులు సినిమా చూడటానికి వచ్చారు. అక్కడ తొక్కిసలాట జరిగగా ఓ మహిళ మృతి చెందింది..

Written by - Renuka Godugu | Last Updated : Dec 13, 2024, 05:18 PM IST
Big Breaking: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..! చంచల్‌గూడ జైలుకు తరలింపు..

Allu Arjun 14 Days Remand: అల్లు అర్జున్ కి నాంపల్లి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడంతో ఆయనపై కేసు నమోదయింది. అల్లు అర్జున్ రావడం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగిందని పోలీసులు నివేదించారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బన్నీకి రిమాండ్ విధించారు.

అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన అరెస్టు నేపథ్యంలో నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించింది. ఈ  నేపథ్యంలో ఆయన చంచల గూడా జైలుకు పోలీసులు తరలించారు. అయితే ఇప్పటికే బన్నీ ప్రత్యక్షంగా నాకు ఎలాంటి సంబంధం లేదు. సినిమాలు విడుదలైనప్పుడు ఇలా వెళ్లడం సహజం. అలాగే అన్ని సినిమాలకు వెళ్లాను. ఈ సినిమాకు వెళ్లాను.. ఇందులో నేను కావాలని చేసింది ఏదీ లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే పోలీసులు అల్లు అర్జున్ వచ్చిన కారణంగానే తొక్కిసలాట జరిగిందని బలంగా వాదించారు. ఈ వాదనకు ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ రిమాండ్ కు తరలించింది. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో బన్నీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.

డిసెంబర్ 5న పుష్ప2 సినిమా విడుదల అయింది. అంతకుముందు రాత్రి 9:30 కు సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో నిర్వహించారు... దీనికి పెద్ద మొత్తంలో అభిమానులు సినిమా చూడటానికి వచ్చారు. అదే సమయంలో బన్నీ కూడా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో సినిమాకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు వదిలింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాలలో గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనలో బన్నీ పై చిక్కడపల్లి పోలీసులు బిఎన్ఎస్ 118(1) బిఎన్ఎస్ 105, రెడ్ విత్ 3/5 కేసు నమోదు చేశారు. అర్జున్ తరఫున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేయగా ఈరోజు మధ్యాహ్నం 2:30 వాయిదా వేసి 4 గంటల సమయంలో రిమాండ్ కు తరలిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అయితే అల్లు అర్జున్ సినిమా విడుదలకు ఆ సంధ్య థియేటర్ యాజమాన్యం డిసెంబర్ 2వ తేదీ నాడే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనుమతికి వినతి పత్రం సమర్పించినట్టు ఒక లేఖ విడుదల చేసింది. అందులో డిసెంబర్ 4 తేదీన బెనిఫిట్ షో వేయబోతున్నాము... అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక పలువురు రానున్నారు. బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము... అని లేఖలో రాసి ఉంది. ఇది మీడియాకు విడుదల చేసింది సంధ్య థియేటర్ యాజమాన్యం. ఇది చూసి ఒక్కసారిగా సర్వత్ర ఆశ్చర్యపోతున్నారు. మరి లేఖ పంపినా కమిషనర్ ఎందుకు స్పందించలేదు అన్నది అసలు విషయం. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది అని చర్చిస్తున్నారు.

అయితే సంధ్య థియేటర్ ఘటనలో మరణించిన మృతురాలు రేవతి భర్త భాస్కర్‌ కూడా కేసును విత్‌డ్రా చేసుకుంటానని మీడియాతో వెల్లడించాడు... అల్లు అర్జున్ కు ఈ ఘటనతో సంబంధం లేదని ఆయన్ను విడుదల చేయాలని పోలీసులను కోరారు. అయినా పట్టించుకోకుండా అల్లు అర్జున్ ను ఇలా రిమాండ్ కు తరలించడం అనడం గమనార్హం... కాసేపట్లో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.

మోహన్ బాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు, అరెస్టుకు అవకాశం?  

పుష్ప2 జేసీబీ ఎఫెక్ట్.. సిద్ధార్థ్ మూవీకి బిగ్ షాక్, ఆ థియేటర్లో కేవలం 5 టిక్కెట్లే బుక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x