Bigg Boss 5 Telugu: నాలుగోవారం నటరాజ్‌ మాస్టర్‌ ఔట్.. ఎలిమినేట్‌ అవ్వడానికి కారణాలివే!

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ నాలుగు వారాలు పూర్తిచేసుకుంది. ఇందులో భాగంగా..నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. మరి మాస్టర్ ఎలిమినేట్ కావడానికి కారణాలు ఏంటో చూద్దాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 4, 2021, 11:21 AM IST
  • రసవత్తరంగా తెలుగు బిగ్ బాస్
  • విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి
  • ఎలిమినేట్ అయిన నటరాజ్ మాస్టర్
Bigg Boss 5 Telugu: నాలుగోవారం నటరాజ్‌ మాస్టర్‌ ఔట్.. ఎలిమినేట్‌ అవ్వడానికి కారణాలివే!

Bigg Boss 5 Telugu:  బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ రోజురోజూకు ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగు వారం హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఔటయ్యారు. ఇప్పటి వరకు ఫిమేల్ కంటెస్టెంట్ల ఎలిమినేట్ కాగా..తొలిసారి మేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. మరి నటరాజ్‌ మాస్టర్‌(Natraj Master) ఎలిమినేట్(Elimination)కావడానికి కారణం ఏంటంటే..

డిఫరెంట్ యాటిట్యూడ్
బిగ్‌బాస్‌ షో(Bigg Boss 5 Telugu)లో అడుగుపెట్టినప్పటి నుంచి నటరాజ్ మాస్టర్(Natraj Master) యాటిట్యూడ్ ఢిపరెంంట్ గా ఉంది. టాస్క్‌ల్లో బాగానే పర్ఫామ్‌ చేసినప్పటికీ వింత బిహేవియర్‌ వల్ల కమెడియన్‌గా మారిపోయాడు. నేను మోనార్క్‌ను, నా మాటే అందరూ వినాలి, కానీ నేనెవరి మాటా వినను అన్నట్లుగా ప్రవర్తించడంతో అటు కంటెస్టెంట్లతో పాటు ఇటు జనాలకు కూడా విసుగు పుట్టించాడు. పైగా నేను సింహాన్ని.. పులితో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే అంటూ డైలాగులు వదలడం, కథలు చెప్పడం కాస్త అతిగా అనిపించాయి. ఈ ప్రవర్తనే అతడి ఓట్లను దెబ్బతీశాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

Also read: BiggBossTelugu5: బిగ్‌బాస్ హౌజ్‌లో దాక్కో దాక్కో మేక ఆట ఆడించిన నాగ్‌

హౌస్ మేట్స్ ను జంతువులతో పోల్చడం
అయితే నటరాజ్ కొరియోగ్రాఫర్(Choreographer)గా కూడా తన మార్క్ ను చూపించలేకపోయారు. కంటెస్టెంట్లతో గొడవలు పెట్టుకుని మరింత నెగిటివిటీను మూటగట్టుకున్నారు. ఇంటిసభ్యులను జంతువులతో పోల్చడం, వాళ్లకు ఇష్టమున్నా లేకపోయినా ఎప్పటికప్పుడు కొత్త కొత్త జంతువుల పేర్లతో పిలవడం చాలామందికి నచ్చలేదు. హౌస్‌లో ఎవరూ ఆయనను పట్టించుకోకపోయినప్పటికీ అతడు మాత్రం అందరూ తనను టార్గెట్‌ చేస్తున్నారన్న భ్రమలో, బాధలోనే నాలుగువారాలు గడిపేశాడు.

అమ్మాయిలను వద్దని నట్టూను పంపించారా?
ఇప్పటికే వరుసగా మూడు వారాలు లేడీ కంటెస్టెంట్లే(Lady contestants) ఎలిమినేట్ అయ్యారు. దీంతో బిగ్ బాస్ ఆటతీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో మరోసారి ఆడవాళ్లను పంపిచేశారంటే కచ్చితంగా విమర్శలపాలవుతామని బిగ్‌బాస్‌ యాజమాన్యం నటరాజ్‌ మాస్టర్‌ మీద ఫోకస్‌ చేసి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫాలోయింగ్‌ తక్కువగా ఉన్న నటరాజ్‌కు అనఫీషియల్‌ పోల్స్‌తో పాటు అధికారిక పోల్స్‌లోనూ ఓట్లు తక్కువగా వచ్చాయని అందుకే ఆయన షోకు గుడ్‌బై చెప్పక తప్పలేదని సమాచారం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News