Bigg Boss captaincy Task : నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం.. కంటెస్టెంట్లపై విరుచుకుపడ్డ బిగ్ బాస్

Bigg Boss 6 Telugu 7th week captaincy contender task ఇంట్లోని తన కంటెస్టెంట్ల మీద బిగ్ బాస్ ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు. నిర్లక్ష్య ధోరణి మీద కౌంటర్లు వేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2022, 04:19 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం సందడి
  • గెటప్పులతో ఆకట్టుకున్న కంటెస్టెంట్లు
  • ఆటలో నిర్లక్ష్యంపై బిగ్ బాస్ ఆగ్రహం
Bigg Boss captaincy Task : నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం.. కంటెస్టెంట్లపై విరుచుకుపడ్డ బిగ్ బాస్

Bigg Boss captaincy Task : బిగ్ బాస్ ఆరో సీజన్ ఎంత నీరసంగా సాగుతోందో అందరికీ తెలిసిందే. ఆరువారాలు గడిచినా కూడా ఇంత వరకు టైటిల్ గెలిచే సత్తా ఉన్న కంటెస్టెంట్ ఎవరు? ఆ అర్హత ఎవరికి ఉందనే విషయంలో ఎవ్వరికీ ఓ అభిప్రాయమంటూ రాలేదు. అంటే ఈ సీజన్, అందులోని కంటెస్టెంట్లు ఎలా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఉన్నవారిలో కాస్తో కూస్తో అంటే రేవంత్, గీతూ, బాలాదిత్య పర్వాలేదనిపిస్తోంది. అందులోనూ రేవంత్ తన నోటిదూల, పిచ్చి చేష్టలు, కోపంతో ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు.

ఇక గీతూ అయితే తన చేష్టలతో ఇంటి సభ్యులనే కాదు.. చూసే జనాలను కూడా చిరాకు పెట్టిస్తోంది. గీతూ ప్రతీసారి సోది సోది అంటుంది.. కానీ ఆమె చివరకు సోదిలా మారిందని తెలుసుకోలేకపోతోంది. పక్క వారి మీద రివ్యూలు చేసుకుంటూ.. తన స్థాయి ఏంటన్నది మరిచిపోతోన్నట్టుంది. కామెడీ చేస్తున్నాను అనే భ్రమలో ఉంటోన్న గీతూ.. అందరినీ విసిగిస్తోందని తెలుసుకోలేకపోతోంది. ఆమె టాప్ 5 వరకు ఉంటుందేమో గానీ.. విన్నర్ అయితే కాలేదు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News