BB 7 latest Promo: ‘థూ’ అనేసిన ప్రియాంక.. ఇచ్చిపడేసిన భోలే.. మితిమీరిన శోభా.. ఫీలైన తేజా..

BB 7 Updates: ఈ వారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా ఉంది. తొలి రోజు ప్రశాంత్-సందీప్ లు గొడవపడితే.. రెండో రోజు భోలే షావలి, ప్రియాంక జైన్, శోభా శెట్టి మధ్య భారీ వాగ్వాదం చోటుచేసుకుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 05:02 PM IST
BB 7 latest Promo: ‘థూ’ అనేసిన ప్రియాంక.. ఇచ్చిపడేసిన భోలే.. మితిమీరిన శోభా.. ఫీలైన తేజా..

Bigg Boss 7 Telugu latest Promo: బిగ్ బాస్ ఆరు వారాలు కంప్లీట్ చేసుకుని ఏడో వారంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోమవారం నామినేషన్ల హిట్ ను మంగళవారం కూడా కొనసాగించారు హౌస్ మేట్స్. తొలి రోజు పల్లవి ప్రశాంత్-సందీప్ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇవాళ సీరియల్ బ్యాచ్ భోలేపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రియాంక, శోభాశెట్టిలతో పాటబిడ్డ ఓ చిన్నపాటి యుద్ధమే చేశాడు. ఒకరిపై ఒకరు అరుచుకుంటున్న క్రమంలో ప్రియాంక నోరు జారింది. భోలేను థూ అన్నది. సీరియల్ బ్యాచ్ కు కూడా గట్టిగానే ఇచ్చిపడేశాడు భోలే. 

నామినేషన్స్ లో భాగంగా.. తొలుత తేజాను నామినేట్ చేసింది శోభా శెట్టి. ''పనిష్మెంట్ సీరియస్ గా తీసుకోవడం లేదని..వీఐపీ రూంలోకి వెళ్తాను పడుకుంటాను అంటూ అనడం నాకు నచ్చడం లేదంటూ చెప్పేసింది. దీంతో నేను ఫన్ గా అలా అన్నాను బ్రో అంటూ తేజా అనగా.. నీకు ప్రతీదీ ఫన్ బ్రో.. మాకు సీరియస్ బ్రో'' అంటూ నామినేట్ చేసింది. ఇక రెండో నామినేషన్ గా భోలేను ఎంచుకుంది శోభా.  ‘నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుంది. ఆడపిల్లలు మీకు మంచి భవిష్యత్ ఉంది’ అని భోలే అంటాడు. దీంతో మధ్యలోకి ప్రియాంక ఎంట్రీ ఇస్తుంది. ‘ఆడపిల్లా.. ఆడపిల్లా అంటూ నటిస్తున్నావ్ కదా..కనిపిస్తుంది’ అంటూ భోలేతో గొడవపడుతుంది. నీలాంటోళ్లని చాలా మందిని చూశా పో అంటాడు భోలే. దీంతో మరింత సీరియస్ అవుతుంది ప్రియాంక. 

అటు శోభాశెట్టి సైతం భోలేపై రెచ్చిపోతుంది. పక్కన ఆడపిల్ల ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకో అంటూ వార్నింగ్ ఇస్తుంది. పూర్తిగా కంట్రోల్ తప్పిన ప్రియాంక..భోలేను చూస్తూ థూ అని నోరు జారుతుంది. దీనికి కౌంటర్ గా భోలే.. 'నువ్వు నన్ను థూ అన్నావ్..అదే థూ నేను ఊస్తే నీ బతుకు ఏం కావాలి'' అంటూ ఇచ్చేపడేశాడు. ఆ తర్వాత నువ్వు నిజంగా మోనితవే అని భోలే చెప్పగా..సైకలా ప్రవర్తించింది శోభా. ఆ తర్వాత శోభా నామినేట్ చేయడంతో తేజా ఫీల్ అవ్వడాన్ని ప్రోమోలో చూపించారు మేకర్స్. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News