Saindhav Update: సైంధవ్ నుంచి ఎమోషనల్ సాంగ్.. హృదయాన్ని హత్తుకుంటున్న 'బుజ్జికొండవే' పాట..

Saindhav Update: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ లేటెస్ట్ మూవీ సైంధవ్. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 09:00 PM IST
Saindhav Update: సైంధవ్ నుంచి ఎమోషనల్ సాంగ్.. హృదయాన్ని హత్తుకుంటున్న 'బుజ్జికొండవే' పాట..

Saindhav Movie Songs: విక్టరీ వెంకటేశ్ (Venkatesh) నయా మూవీ సైంధవ్‌ (SAINDHAV). హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రాబోతుంది. వెంకటేష్‌కు ఇది 75వ చిత్రం కావడం విశేషం. వెంకీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీమ్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బుజ్జికొండవే అంటూ సాగే లిరికల్‌ సాంగ్ చాలా ఎమోషనల్ గా ఉంది. వెంకీ, తన కూతురు మధ్య సెంటిమెంట్ ను సాంగ్ లో చూపించారు. ఈ పాటను ఎస్పీ చరణ్ అలపించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 

Also Read: Kalki 2898 AD :కల్కి లో ఇండియా ఫ్యూచర్ చూస్తారు.. ట్రైలర్ విడుదల అప్పుడే: నాగ్ అశ్విన్

ఈ చిత్రానికి వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు కీలకపాత్రలు పోషించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News