Mega 154 Title Teaser : వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారం.. అదరగొట్టేసిన చిరు

Chiranjeevi Director Bobby Movie మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ సినిమా టైటిల్‌ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే దాన్ని అధికారికంగా దీపావళి నాడు ప్రకటించారు. టైటిల్ పోస్టర్, టీజర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 11:20 AM IST
  • మెగా 154 టైటిల్ ప్రకటన
  • దీపావళికి సరైన బహుమతి
  • ఖుషీ అవుతున్న మెగా ఫ్యాన్స్
Mega 154 Title Teaser : వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారం.. అదరగొట్టేసిన చిరు

Mega 154 Title Teaser - Waltair Veerayya : దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. చిరంజీవి, బాబీ దర్శకత్వంలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన టైటిల్ మీద ఇన్ని రోజులు ఎన్నో చర్చలు జరిగాయి. ఎన్నెన్నో లీక్స్ వచ్చాయి. చిరంజీవి నోటి వెంట కూడా టైటిల్ ఇది వరకే బయటకు వచ్చింది. శేఖర్ మాస్టర్ కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. సినిమా పేరు చెప్పేశాడు. వాల్తేరు వీరయ్య అనేది టైటిల్ ఫిక్స్ అయిందని ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా సినిమా టైటిల్‌ను ప్రకటించేశారు.

ఏంట్రా ఆడొస్తే పూనకాలన్నాడు.. అడుగేస్తే అరాచకం అన్నాడు.. ఏడ్రా మీ అన్నయ్య.. సౌండే లేదు.. అంటూ విలన్ చెప్పే డైలాగ్.. రివర్స్ ఆర్డర్‌లో స్క్రీన్ ప్లేని తీసుకెళ్తూ.. బీడీ తాగుతున్న చిరంజీవిని చూపించేశాడు బాబీ. అతడి టేకింగ్‌కు.. దేవీ శ్రీ ప్రసాద్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందంతే. చిరంజీవిలోని ఈజ్, అదిరిపోయే మ్యానరిజం, యాటిట్యూడ్ అన్నీ కూడా మెప్పించాయి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే.. లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చేయండి అంటూ చిరు చెప్పిన డైలాగ్ సూపర్బ్ అంతే. చివర్లో చిరు అలా నడుచుకుంటూ రావడం, బీడీ వెలిగించుకోవడం అన్నీ కూడా మాస్‌కు విపరీతంగా ఎక్కేస్తాయి. చివర్లో హ్యాపీ దివాళి.. తొందర్లోనే కలుద్దామంటూ రవితేజ వాయిస్ వినిపించడం హైలెట్.

అసలే ఇప్పుడు రీమేక్‌లో చిరంజీవి వస్తుండటం.. వాటిపై సాధారణ ఆడియెన్స్ అంతగా ఆసక్తిని కూడా చూపించకపోవడంతో.. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మీద అందరి దృష్టి పడింది. అందుకే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరంజీవి సోలోగా రావడం మానేసినట్టు కనిపిస్తోంది. తన పక్కన మరో స్టార్ హీరో ఉండాలని భావిస్తున్నట్టుగా ఉంది. ఇక ఇందులో అయితే రవితేజ కనిపించబోతోన్నాడు. అన్నయ్య సినిమా తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఇలా చిరంజీవితో కలిసి రవితేజ నటిస్తున్నాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News