Waltair Veerayya Interval Scene : గజరాజుకి పూనకాలు లోడింగ్.. చిరంజీవి పోస్ట్ వైరల్.. ఇంట్రెస్టింగ్ వీడియో

Waltair Veerayya Interval Scene వాల్తేరు వీరయ్య సినిమా ఇంట్రవెల్‌కు నిజంగానే పూనకాలు లోడింగ్ సీన్లు ఉంటాయి. చిరంజీవి అలా ఏనుగు మీద నడిచి రావడం.. బాబీ సింహా కారు మీద ఏనుగు అడుగు పెట్టడం ఆ సీన్‌ చూసిన జనాలకు పూనకాలు రావడం అన్నీ కామన్.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2023, 01:16 PM IST
  • నెట్టింట్లో యాక్టివ్‌గా మెగాస్టార్ చిరంజీవి
  • వాల్తేరు వీరయ్య ఇంట్రవెల్ సీన్‌
  • గజరాజుకు పూనకాలు లోడింగ్ వీడియో
Waltair Veerayya Interval Scene : గజరాజుకి పూనకాలు లోడింగ్.. చిరంజీవి పోస్ట్ వైరల్.. ఇంట్రెస్టింగ్ వీడియో

Waltair Veerayya Interval Scene చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు ఇంట్రవెల్ సీన్ ఎలాంటి హై ఇచ్చింది.. పూనకాలు లోడింగే, మాస్ మూలవిరాఠ్, అరాచకం ఆరంభం అనే పదాలకు నిర్వచనంగా ఆ సీన్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ సీనే బయటకు కూడా జరిగిందట. కారు మీదకు ఏనుగు ఎక్కేసిన వీడియోను చిరంజీవి షేర్ చేశాడు. గజరాజుకు పూనకాలు లోడింగ్ అంటూ చిరు షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

మెగాస్టార్ చిరంజీవిని ఆడియెన్స్, అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో.. అలానే చూపించాడు డైరెక్టర్ బాబీ. మాస్ పల్స్, ఆడియెన్స్ టేస్ట్‌ను పట్టుకుని చిరంజీవితో వాల్తేరు వీరయ్య చేశాడు. పూనకాలు లోడింగ్ అంటూ అందరినీ ఊపేశాడు. థియేటర్లో చిరు మాటలు, పాటలు, ఫైట్లకు అభిమానులకు నిజంగానే పూనకాలు వచ్చేశాయి.

సంక్రాంతి బరిలో క్లియర్‌ విన్నర్‌గా వాల్తేరు వీరయ్య నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు నూట అరవై శాతానికి పైగా రికవరీ చేసి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లో వీరయ్య ది బెస్ట్, టాప్ ప్లేస్‌లోకి వెళ్లిపోయింది.

వాల్తేరు వీరయ్య సినిమా ఇంట్రవెల్ సీన్‌ రిపీట్ అయిందన్నట్టుగా చిరంజీవి ప్రస్తుతం షేర్ చేసిన వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. నిజంగానే సినిమాలో సీన్‌ను చూసినట్టుగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఆ ఏనుగు కారు మీదకు ఎక్కాలని ప్రయత్నించింది. కానీ అది కుదర్లేదు.

ముందు బంపర్ మాత్రం ఊడిపోయింది. దీంతో సదరు కారు డ్రైవర్ చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. లేదంటే గజరాజు కింద పడి కారు నలిగిపోయేది. ప్రస్తుతం చిరంజీవి పెట్టిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. చిరంజీవి ఈ మధ్యే భోళా శంకర్ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు.

Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు

Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News