పెళ్లి కోసం దీపికా పదుకునె జువెలరీ షాపింగ్ మొదలుపెట్టిందా ?

దీపికా పదుకునె జువెలరీ షాపింగ్ ?

Last Updated : Jun 7, 2018, 02:18 PM IST
పెళ్లి కోసం దీపికా పదుకునె జువెలరీ షాపింగ్ మొదలుపెట్టిందా ?
ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్‌లతో సంబంధం లేకుండా విశ్రాంతి తీసుకుంటోన్న దీపికా పదుకునే తాజాగా ముంబైలోని బాంద్రాలో ఓ ప్రముఖ జువెలరీ దుకాణంలోంచి బయటికొస్తూ కనిపించింది. ఆ సమయంలో దీపికా పదుకునె వెంట ఆమె తల్లి కూడా ఉన్నారు. ఈ ఏడాది బాలీవుడ్ పరిశ్రమలో జరగనున్న మరో గ్రాండ్ వెడ్డింగ్ ఈవెంట్ ఏదైనా ఉందా అంటే దీపికా పదుకునె-రణ్‌వీర్ సింగ్‌ల పెళ్లేననే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. దీనికితోడు మరోవైపు దీపికా కూడా ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు పెళ్లి షాపింగ్‌పై దృష్టిసారిస్తున్నట్టు తెలుస్తోంది. పింక్ అనార్కలి దుస్తులు, బంగారు వర్ణం పాదరక్షలు ధరించి, బంగారం దుకాణంలోంచి నవ్వుతూ బయటికొస్తున్న దీపికాను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అన్నట్టుగా ఉంది.

దీపికా పదుకునే ఇటీవల కాలంలో ఇలా జువెలరీ షాప్స్ చుట్టూ చక్కర్లు కొట్టడం ఇదేం మొదటిసారికాదు. మార్చి నెలలోనూ దీపికా తన సోదరి అనిషా, తల్లితో కలిసి బెంగుళూరులోని పలు నగల దుకాణాలను కలియతిరుగుతూ కనిపించిన సంగతి తెలిసిందే.

దాదాపు నాలుగేళ్లకుపైగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్న దీపికా పదుకునె-రణ్‌వీర్ సింగ్ ఈ ఏడాది చివరికల్లా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారు అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు బాలీవుడ్ మీడియా టాక్. అందుకే ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడే దీపికా పెళ్లి షాపింగ్ చేసేస్తోంది అంటున్నాయి పరిశ్రమవర్గాలు.

 

 

 

Trending News