దేవదాస్ మూవీలో ఈ డిలీటెడ్ సీన్ ఉండుంటే ఇంకెంత బాగుండేది

దేవదాస్ మూవీ నుంచి డిలీటెడ్ సీన్

Last Updated : Sep 30, 2018, 03:04 PM IST
దేవదాస్ మూవీలో ఈ డిలీటెడ్ సీన్ ఉండుంటే ఇంకెంత బాగుండేది

మన్మథుడు నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ఇటీవలే విడుదలై మంచి కలెక్ష్సన్స్ రాబట్టుకుంటూ బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతోంది. వైజయంతి బ్యానర్‌పై అశ్వినిదత్ నిర్మించిన ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేశాడు. వృత్తిపై మమకారం ఉన్న ఓ వైద్యుడు అనుకోని పరిస్థితుల్లో మాఫియాతో స్నేహం చేయడం వల్ల ఎదుర్కున్న అనుభవాలు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలోంచి తొలగించిన ఓ సన్నివేశాన్ని తాజాగా మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కార్పోరేట్ ఆస్పత్రుల్లో దాపురించిన దుస్థితిని ఈ సన్నివేశంలో కళ్లకు కట్టినట్టు తెరకెక్కించారు. ఈ ఆస్పత్రి సన్నివేశాన్ని చూశాకా.. ఇటువంటి సీన్‌ని తొలగించకుండా సినిమాలోనే ఉండుంటే ఇంకా బాగుండేదనిపించకమానదు.

Trending News