Thiruveer Masuda : దిల్ రాజు చేతికి మసూద.. తిరువీర్‌కు దశ తిరిగేనా?

Dil Raju Masuda Movie దిల్ రాజు ఓ సినిమాను రిలీజ్ చేస్తున్నాడంటూ అందరి దృష్టి పడుతుంటుంది. అయన జడ్జ్మెంట్ మీద జనాలకు ఇంకా నమ్మకం ఉంది. తాజాగా ఆయన మసూద అనే చిన్న సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 04:50 PM IST
  • హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న తిరువీర్
  • మసూద సినిమా కోసం దిల్ రాజు
  • నవంబర్ 18న రాబోతోన్న మసూద
Thiruveer Masuda : దిల్ రాజు చేతికి మసూద.. తిరువీర్‌కు దశ తిరిగేనా?

Thiruveer Masuda Movie : మసూద సినిమాతో తిరువీర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. ఇంతకు ముందు జార్జిరెడ్డి, పలాస చిత్రాల్లో విలన్ షేడ్స్ ఉండే కారెక్టర్లో నటించాడు. మెట్రో కథలు అంటూ ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించాడు. కానీ ఇప్పుడు మసూద సినిమాతో హీరోగా రాబోతోన్నాడు. ఈ చిత్రాన్ని ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన రాహుల్ యాదవ్ నిర్మించాడు. ఆ రెండు చిత్రాలు ఎంతగా క్లిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ రెండు సినిమాలు చూసి దిల్ రాజు ఫిదా అయ్యాడట.

ఇప్పుడు రాహుల్ యాదవ్ బ్యానర్ అయిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద మూడో చిత్రంగా ఈ మసూద రాబోతోందట. మసూదను తాను రిలీజ్ చేస్తానని దిల్ రాజు ముందే మాటిచ్చాడట. టీజర్ చూశాక.. మరింతగా ఫిక్స్ అయ్యాడట. ఫైనల్ కాపీ ఎప్పుడెప్పుడు చూస్తానా? అని వెయిట్ చేశాడట. అలా దిల్ రాజు మాత్రం ఈ మసూద సినిమా మీద, చిత్రయూనిట్ మీద మంచి నమ్మకంతో ఉన్నారనిపిస్తోంది.

చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ దిల్ రాజుది చాలా మంచి చెయ్యి అని పొగిడేశారు. అయితే తనది కూడా మంచి చెయ్యే అని రెండు మంచి చేతులు కలిస్తే గట్టిగా సౌండ్ వస్తుందని భావిస్తున్నానంటూ అందరినీ నవ్వించేశారు. ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలు తమ ద్వారా రావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చాడు.

మసూద మూడు సంవత్సరాల కష్టమని తెలిపారు. మధ్యలో కోవిడ్ రావడంతో మరింతగా ఆలస్యమైందని పేర్కొన్నారు.. మళ్లీ రావాతో గౌతమ్ తిన్ననూరి, ఏజెంట్ సినిమాతో స్వరూప్‌లను పరిచయం చేశాను.. ఇప్పుడు మళ్లీ కొత్త డైరెక్టర్‌ సాయి కిరణ్‌ని పరిచయం చేస్తున్నాను.. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అంటూ నిర్మాత మాట్లాడారు. ఈ సినిమాలో తిరువీర్ పక్కన కావ్యా కళ్యాణ్‌ రామ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

Also Read : Vennela Kishore : ఎంత పని చేశావ్ బ్రో.. వెన్నెల కిషోర్ చేసినదానికి నెటిజన్ రియాక్షన్

Also Read : Vikram Pathala Pathala Song : కమల్ హాసన్ బర్త్ డే పార్టీ.. మత్తుగా మత్తుగా అంటూ సీనియర్ హీరోయిన్‌ రాధికతో స్టెప్పులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News